వివాదాలతో సావాసం అంటే రామ్‌గోపాల్ వర్మకి ఎంతో ఇష్టం. ఎన్ని వివాదాలొచ్చినా అస్సలు చలించరు ఆయన. తన పని తాను చేసుకుంటూనే పోతారు. అయితే ఈ మధ్య ఈ వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' వీడియో రేపిన దుమారం అంతా ఇంతా కాదు. టోటల్‌గా న్యూడ్ వీడియో ఇది. పోర్న్ స్టార్ మియా మల్కోవాతో ఈ వీడియోని తెరకెక్కించారు రామ్‌గోపాల్ వర్మ. ఇది తెలిసిన విషయమే. సమాజంలోని మహిళలు సిగ్గుపడేలా ఉన్న ఈ వీడియోను విడుదల కాకుండా అడ్డుకునేందుకు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కానీ, ఫలించలేదు. వీడియో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఇదంతా జరిగిపోయింది. అయితే అప్పటి దుమారం ఇంకా సమసిపోలేదు. మహిళా సంఘం నాయకురాలు, సామాజిక కార్యకర్త అయిన దేవి, రామ్‌గోపాల్‌వర్మపై పోలిసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు పలు చర్చా వేదికల్లో కూడా దేవిని అవమానించేలా వర్మ మాట్లాడారనీ, ఆయన్ని అలా వదిలేయకూడదనీ, అరెస్టు చేయాలనీ ఆమె చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ యాక్ట్ 67, ఐపీసీ 508, 509 సెక్షన్స్ కింద వర్మపై కేసు నమోదు చేశారు. దాంతో రామ్‌గోపాల్ వర్మ అరెస్టయ్యే అవకాశాలున్నాయంటూ తాజా సమాచారమ్.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం వర్మ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' వీడియోకి సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నారు ఓ పక్క. మరో పక్క నాగార్జునతో యాక్షన్ మూవీని తెరకెక్కించే పనిలో కూడా ఉన్నారు. ముంబయ్‌లో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది పూర్తి కాగానే ఎన్టీఆర్ బయోపిక్‌పై వర్మ కాన్సన్ట్రేషన్ చేయనున్నారనీ తెలుస్తోంది.