ముద్దుగుమ్మ పూజా హెగ్దే ఇప్పుడు టాలీవుడ్‌లో పాపులర్ హీరోయిన్ అయిపోయింది. 'డీజె - దువ్వాడ జగన్నాధమ్' సినిమాతో అమ్మడికి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. 'ముకుందా' సినిమాలో కూల్ అండ్ లవ్లీ గాళ్‌గా కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ 'డీజె'లో మాత్రం గ్లామర్‌తో కెవ్వు కేక పెట్టించేసింది. ఏకంగా బికినీలో స్కిన్ షో చేసేసి అదరగొట్టేసింది. కుర్రాకారు గుండెల్లో గునపాలే దించేసింది. సినిమాలో అల్లు అర్జునే కాదు, ఆమె బికినీ షో చూసి అంతా వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. స్విమ్మింగ్ పూల్‌లో ఆమె అందాల దాడికి పాపం వెజిటేరియన్ అయిన పంతులు కూడా మంత్రాలు మర్చిపోయి, ప్రేమ పాఠాలు వల్లె వేస్తూ, తన మంత్రాలను ఈ బ్యూటీ అంగాంగ ప్రదర్శన కోసం వాడేశాడు. నమకం, చమకం, అగ్రహారం, తమలపాకు అంటూ తత్తర బిత్తరపోయాడు. ఈ విషయంలో అందుకే పెద్ద వివాదమే తలెత్తింది అనుకోండి అది వేరే విషయం. ఇప్పుడు ఈ భామ బికినీ షోతో వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆమెకి అవకాశాలు వరదలై పొంగుకొచ్చేస్తున్నాయంటే నమ్మి తీరాల్సిందే. ఇప్పుడు ఎక్కడ విన్నా ఆమె బికినీ గురించే చర్చ. సినిమాలో ఆ సీన్‌కి బికినీ వేయాల్సి వచ్చిందనీ, సిట్యువేషన్ డిమాండ్ చేస్తే ఏ తరహాలో గ్లామర్ పండించడానికైనా తాను రెడీ అని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. ఈ ఆటిట్యూడ్ వాస్తవానికి టాలీవుడ్‌కి అంత అవసరం లేనప్పటికీ, గ్లామరస్‌గా కనిపిస్తానంటే ఆడియన్స్ వద్దంటారా? నో వే!