ఆచార్య ఫ్లాప్ నుంచి కాజల్ తప్పించుకుంది గానీ, పూజా హెగ్డే దొరికిపోయింది. ఆచార్యలో కాజల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో కాజల్ సీన్లన్నీ లేచిపోయాయి. దాంతో ఈ సినిమాలోని ఏకైక కథానాయిగా పూజా హెగ్డే మిగిలిపోయింది. నిజానికి పూజాని కూడా గెస్ట్ రోల్ కే పిలిచారు. ఎలాగూ హీరోయిన్ లేదు కదా అని ఆ పాత్ర లెంగ్త్ ని కాస్త పెంచారు. దాంతో ఆచార్యలోని ఏకైక హీరోయిన్‌గా పూజా నిలిచి, ఈ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసేసుకుంది.
రాధేశ్యామ్, బీస్ట్.. ఆచార్య.. ఇవి ఒకదాన్ని మించి మరోటి ఫ్లాప్ అయ్యాయి. ఈ మూడు సినిమాల్లోనూ సోలో హీరోయిన్‌గా నటించింది పూజా. అలా హ్యాట్రిక్ ఫ్లాపులు మూటగట్టుకుంది. ఇప్పటికే ఈ అమ్మడిపై ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింది. ఆచార్యతో అది కాస్త స్ట్రాంగ్ అయిపోయినట్టే. అయితే ఈ ఫ్లాపుల ప్రభావం పూజా కెరీర్‌పై ఉంటుందనుకోవడానికి వీల్లేదు. తను ఇప్పటికీ స్టార్ హీరోయినే. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయిక తనే. కాకపోతే... ఇక ముందు పూజా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇలా విరామం లేకుండా ఫ్లాపులుల పడితే... ఎప్పటికైనా ప్రమాదమే.