అందం ఎక్కడుంటుందో తెలుసా?

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ పూజా హెగ్దే. అందాల రాశి. ఇది ఎవరైనా చెప్పగలరు. అయితే ఈ ముద్దుగుమ్మని అందం గురించి అడిగితే ఏం చెబుతోందో తెలుసా? 'అందం అనేది ముఖంలో ఉండదు. హార్ట్‌లో ఉంటుంది..' అని చెబుతోంది. అందాల పోటీ నుండి వచ్చిన ఈ బ్యూటీ అందం గురించి చాలా చాలా అందంగా చెప్పింది కానీ, తనలోని అందాల్ని ప్రదర్శించేందుకు ఏమాత్రం మొహమాటపడదు. 

'డీజె - దువ్వాడ జగన్నాధమ్‌'లో అమ్మడి అందాల ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి మరి. ఎందుకంటే, హాట్‌ హాట్‌ బికినీలతో కుర్రకారును పిచ్చెక్కించేసింది ఈ సినిమాలో పూజా హెగ్దే. అంతేకాదు సినిమాలతో సంబంధం లేకుండా, సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫోటోలతో ఎప్పటికప్పుడే తనలోని హాట్‌ అప్పీల్‌ని ప్రదర్శిస్తూ ఉంటుంది. మరి ఆ ఎక్స్‌పోజింగ్‌ సంగతేంటని అడిగితే, అది ఎక్స్‌పోజింగ్‌ కాదు. జస్ట్‌ స్టైలిష్‌ లుక్‌ అంతే అని సింపుల్‌గా చెప్పేస్తోంది. అయినా ఎక్స్‌పోజింగ్‌ గురించి ఈ రోజుల్లో అస్సలు మాట్లాడకూడదంటోంది. ఇది చాలా చాలా సర్వసాధారణ విషయం అంటోందీ హాట్‌ బ్యూటీ. 

ఇన్నీ చెబుతున్న ఈ బ్యూటీ మరి అందం గురించి, హార్ట్‌కి లింక్‌ పెట్టి మాట్లాడడం వెనక ఆంతర్యం ఏమిటో ఈ ముద్దుగుమ్మకే తెలియాలి. మోడ్రన్‌గా కంఫర్టబుల్‌గా ఉండే కాస్ట్యూమ్స్‌ని వేసుకోవడానికి ఈ బ్యూటీ ఎప్పుడూ వెనుకాడదట. అయితే గమనించాల్సిందేంటంటే, అందులో గ్లామర్‌ కూడా ఖచ్చితంగా ఉండాలంటోంది. అయినా కాస్ట్యూమ్‌లో గ్లామర్‌ సంగతి పక్కన పెడితే, పూజా హెగ్దే ముఖ కవళికల్లోనే బోలెడంత అందం దర్శనమిస్తూ ఉంటుంది. మత్తెక్కించే కళ్లు, కైపెక్కించే పెదాలతో ఆమె నగు మోము అందం ముందు, ఎంత హాట్‌ హాట్‌ కాస్ట్యూమ్‌ అయినా చిన్నబోవాల్సిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో 'సాక్ష్యం' సినిమాలో నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS