పూజా ఇది నిజమేనా.?

మరిన్ని వార్తలు

'రంగస్థలం' సినిమాలో 'జిగేల్‌ రాణి'గా వీర లెవల్లో స్టెప్పులేసిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే మరోసారి స్టేజ్‌ ఇరగదీసేయడానికి రెడీ అవుతోందట. మొన్న చరణ్‌ కోసం గజ్టె కట్టి చిందేస్తే, ఇప్పుడు మరో మెగా హీరో కోసం రంగంలోకి దిగబోతోందట. మాస్‌ స్టెప్పులతో మరోసారి ఫ్యాన్స్‌కి దిల్‌ ఖుషీ చేయనుందట. 

 

ఇంతకీ ఏ సినిమా కోసమో గెస్‌ చేసేశారా.? అవును ఒకవేళ గెస్‌ చేస్తే మీ గెస్‌ నిజమే. బన్నీ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం పూజాహెగ్డే మరోసారి ఐటెం గాళ్‌ అవతారమెత్తబోతోందట. ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్‌కి ప్లాన్‌ చేస్తున్నారట. ఆ సాంగ్‌ కోసం పూజాహెగ్డేని సంప్రదించినట్లు సమాచారమ్‌. 'అరవింద సమేత' కోసం త్రివిక్రమ్‌తో పని చేసింది పూజాహెగ్డే. 'డీజె'లో అల్లు అర్జున్‌తో రొమాంటిక్‌ స్టెప్పులేసింది. 

 

ఇక ఈ సారి వీరిద్దరి కాంబినేషన్‌లో మాస్‌ డాన్సులతో పిచ్చెక్కించేయనుందట. అంతేకాదు పూజాకి ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్‌ గెస్ట్‌ రోల్‌ కూడా ఇవ్వనున్నాడట త్రివిక్రమ్‌. నిడివి చాలా తక్కువ ఉన్నా, ఆ క్యారెక్టర్‌ ఆడియన్స్‌కి బాగా రిజిస్టర్‌ అవుతుందని అంటున్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది ఈ సినిమా. మరోవైపు ఈ సమ్మర్‌కి మహేష్‌కి జోడీగా 'మహర్షి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది పూజా హెగ్డే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS