సుకుమార్ ఇప్పుడు డైరెక్టర్‌గా కన్నా నిర్మాతగానే ఎక్కువ బిజీగా ఉన్నాడు. తన సొంత నిర్మాణంలో తన వద్ద పని చేసే అసిస్టెంట్స్‌ని డైరెక్టర్స్‌గా పని చేయిస్తున్నాడు. ఆల్రెడీ తన అసిస్టెంట్ బుచ్చిబాబును డైరెక్టర్‌గా పరిచయం చేసేశాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో. ఇక మరో అసిస్టెంట్‌ని కూడా పరిచయం చేసే పనిలో ఉన్నాడట. ఈ సినిమా కూడా మెగా కాంపౌండ్‌లోనే ఉండబోతోందనీ తెలుస్తోంది. ఈ సారి మెగా డాటర్‌ని హీరోయిన్‌గా పెట్టి సినిమా రూపొందించనున్నాడట.
ఇదో ఫిమేల్ సెంట్రిక్ మూవీ అని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ని సుకుమార్ తన సొంత బ్యానర్ అయిన సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మెగా బ్యానర్‌లో రూపొందించనున్నాడనీ సమాచారమ్. మెగా బ్యానర్ అంటే అది అంజనా ప్రొడక్షన్స్ అయ్యుండొచ్చనీ టాక్ వినిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందించనున్నాడట సుకుమార్. ఆల్రెడీ మైత్రీ మూవీస్ బ్యానర్‌తో కలిసి సుకుమార్ మెగా కాంపౌండ్‌లో వైష్ణవ్‌తేజ్ మూవీకి శ్రీకారం చుట్టాడు.
ఇప్పుడు నిహారికతో మూవీ. తన వద్ద తెరరూపం దాల్చలేని బోలెడన్ని కథలను ఇలా తన అసిస్టెంట్స్‌తో తెరకెక్కించి, గురువు హోదాలో వారికి చిన్నా చితకా సూచనలిస్తూ, డైరెక్టర్స్‌గా ప్రమోషన్‌స ఇస్తూ, మరోవైపు ఆ సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉండబోతున్నాడు. ఆ పై స్టార్ హీరోలతో సొంత డైరెక్షన్‌లో సినిమాలు ఎలాగూ ఉంటాయి. సుకుమార్ డబుల్ ధమాకా అదిరిందిగా.