'సైరా'లో స్టైలిష్‌ స్టార్‌ పాత్రేంటో తెలుసా.?

మరిన్ని వార్తలు

తెలుగుతో పాటు ఇతర భాషల నుండి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న 'సైరా'లో అల్లు అర్జున్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే అల్లు అర్జున్‌ పాత్ర గురించి ఓ గాసిప్‌ వినిపిస్తోంది తాజాగా. 'రుద్రమదేవి' సినిమాలో అల్లు అర్జున్‌ గోన గన్నారెడ్డిగా కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు 'సైరా'లో కూడా అదే తరహా పాత్రలో బన్నీ కనిపించనున్నాడనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. 

 

అంతేకాదు. అల్లు అర్జున్‌ క్యారెక్టర్‌కి సంబంధించి ఓ చిన్న యాక్షప్‌ ఎపిసోడ్‌ కూడా ఉండబోతోందట. ఆ యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం ప్రస్తుతం 'సైరా' టీమ్‌ సన్నాహాలు చేస్తోందట. ఇకపోతే బన్నీ గెటప్‌ విషయమై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ మధ్య బన్నీ ఎక్కడ కనిపించినా గెడ్డంతోనే కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసమే బన్నీ గెడ్డం పెంచుతున్నాడట. తెరపై బన్నీ క్యారెక్టర్‌ మూడు నుండి నాలుగు నిమిషాలు మాత్రమే ఉండనుందనీ తెలుస్తోంది. 

 

ఇదిలా ఉంటే మరోవైపు బన్నీ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు కానీ, మార్చి మొదటి వారంలో కానీ ఈ సినిమా సెట్స్‌ మీదకెళ్లనుంది. హీరోయిన్‌ విషయమై ఆశక్తికరమైన చర్చ జరుగుతోంది. రష్మికా, కైరా అద్వానీ పేర్లు పరిశీలిస్తున్నారు. 'జులాయి' తరహా ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందనీ తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS