పూజా హెగ్దేకి ఆ ‘బ్రేక్‌’ తప్పదా.?

మరిన్ని వార్తలు

మొన్నీ మధ్యనే ‘అల వైకుంఠపురములో’ సినిమాతో హిట్టు కొట్టిన పూజా హెగ్దే, త్వరలో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. మరోపక్క, ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న ‘రాధే శ్యావ్ు’ సినిమా కూడా చేసేస్తోంది పూజా హెగ్దే. ఇదిలా వుంటే, పూజా హెగ్దే ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ హీరోయిన్‌. దాదాపు అడరడజను ప్రాజెక్టులు ఇంకా చర్చల దశలో వున్నాయామెకి. ఇది చాలు, పూజా హెగ్దేకి టాలీవుడ్‌లో వున్న డిమాండ్‌ ఏంటో చెప్పడానికి.

 

సరిగ్గా ఈ టైవ్ులోనే పూజా హెగ్దేకి బాలీవుడ్‌ నుంచీ వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. తాజాగా పూజా హగ్దే, సల్మాన్‌ ఖాన్‌ సరసన ఓ సినిమాకి కమిట్‌ అయిన విషయం విదితమే. మరో బిగ్‌ వెంచర్‌ కూడా ఆమె ఖాతాలో పడబోతోంది. అదీ బాలీవుడ్‌ సినిమానే. దాంతో, పూజా హెగ్దే.. టాలీవుడ్‌కి కొత్త కమిట్‌మెంట్స్‌ ఇవ్వగలదా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తెలుగులో నాలుగైదు సినిమాలు వరుసగా చేసేసినా, హీరోయిన్లకు పెద్దగా ఇబ్బందులుండవు. తెలుగు సినిమాలతోపాటు సౌత్‌లోని ఇతర లాంగ్వేజెస్‌లోనూ సైమల్టేనియస్‌గా సినిమాలు చేయొచ్చు. కానీ, బాలీవుడ్‌ పరిస్థితి వేరు. ఒక్కసారి బాలీవుడ్‌ సినిమాకి కమిట్‌ అయితే, అందులోంచి బయటకు రావడం అంత తేలిక కాదు. ఆ విషయం పూజా హెగ్దేకి కూడా బాగా తెలుసు. కానీ, తప్పదు.. బాలీవుడ్‌ సినిమాలకి వుండే క్రేజ్‌ అలాంటిది. సో, తెలుగు సినిమాలకే పూజా కాస్త బ్రేక్‌ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS