తమిళంలో పూజా హెగ్దేకి వరుస ఆఫర్లు వస్తున్నాయనీ, కొన్ని సినిమాల్ని ఆమె ఓకే చేసేసిందనీ, ఇందులో విజయ్ హీరోగా తెరకెక్కే సినిమా ఒకటి వుందనీ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. అయితే, అదంతా ఫేక్ ప్రచారమని కొట్టి పారేసింది ఈ అందాల భామ. ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాలు చేస్తున్నాననీ, తమిళంలో ఇంతవరకూ ఏ సినిమాకీ కమిట్ కాలేదని పూజా హెగ్దే స్పష్టతనిచ్చింది. గాసిప్స్‌ని తాను ఎంజాయ్ చేస్తాననీ, అయితే ఇలాంటి గాసిప్స్ అభిమానుల్లో గందరగోళానికి కారణమవుతాయి కాబట్టి, స్పందిస్తున్నానని పూజా హెగ్దే పేర్కొంది.
ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్దే, అఖిల్ సరసన ఓ సినిమాలో చేస్తోంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. మరోపక్క, ప్రభాస్ సరసన కూడా ఓ సినిమా చేస్తోంది పూజా హెగ్దే. ఇటీవలే విదేశాల్లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఇవి కాక, మరికొన్ని తెలుగు సినిమాలున్నాయామెకి. కాగా, బాలీవుడ్‌లోనూ పూజా హెగ్దే బిజీగానే వుంది. ప్రస్తుతానికి తమిళ సినిమాలకు కమిట్ కాకపోయినా, కొన్ని చర్చల దశలోనే వున్నాయనీ, తమిళంలో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పూజా హెగ్దే క్లారిటీ ఇచ్చింది. పూజా హెగ్దే ఇటీవల ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కన్పించింది. ఆ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెల్సిందే.
Hello hello. Let’s not jump to conclusions of me doing Tamil films right now. As of now I haven’t signed anything and I have a couple of narrations lined up, but I am definitely looking forward to doing a Tamil film this year...if all goes well...fingers crossed 🤞🏼 Thank you ❤️
— Pooja Hegde (@hegdepooja) March 31, 2020