శృతిహాసన్‌ ఏం చేస్తోందో తెలుసా?

By iQlikMovies - October 06, 2018 - 14:39 PM IST

మరిన్ని వార్తలు

స్టార్‌ హీరోయిన్‌గా తెలుగులో సత్తా చాటిన శృతిహాసన్‌ తమిళ, హిందీ భాషల్లో కూడా ఏకకాలంలో బిజీగా గడిపింది. అయితే ప్రస్తుతం శృతిహాసన్‌ హవా అస్సలు కనిపించడం లేదు. తెలుగులో 'కాటమరాయుడు' చిత్రం తర్వాత శృతి మరో సినిమాలో నటించింది లేదు. చాలా గ్యాప్‌ తీసుకుంది. ఈ మధ్య ఓ తెలుగు సినిమాకి శృతిహాసన్‌ కమిట్‌ అయ్యింది అన్నారు కానీ, ఆ వివరాల్లో ఇంకా సరైన క్లారిటీ లేదు.

అలాగే తమిళ, హిందీ భాషల్లో కూడా నటనకు శృతిహాసన్‌ దూరంగా ఉందనే చెప్పాలి. ఎప్పుడో చిత్రీకరణ మొదలైన 'శభాష్‌ నాయుడు' చిత్రం ఎంత వరకూ వచ్చిందనే సంగతి తెలీదు. కమల్‌హాసన్‌ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ఆయనే లీడ్‌ రోల్‌ పోషిస్తున్నారు. కాగా నటనకు దూరంగా ఉన్న శృతిహాసన్‌ ఇప్పుడు ఏం చేస్తోంది.? అంటూ ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే మొన్నామధ్య శృతి పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వచ్చాయి. అది కూడా నిజం కాదని తేలిపోయింది. 

ఇంతకీ శృతిహాసన్‌ ఏం చేస్తోందంటే.. శృతిహాసన్‌ నటి కాకముందు ఓ పాప్‌ సింగర్‌ అన్న సంగతి తెలిసిందే. అనుకోకుండా నటనలోకి వచ్చింది కానీ, ఆమెకు అసలు ఇంట్రెస్ట్‌ సింగింగ్‌ మీదే. సొంతంగా ఆల్బమ్స్‌ రూపొందిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆ పనిమీదే తన పూర్తి ఫోకస్‌ పెట్టిందట శృతిహాసన్‌. 

తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌ న్యూక్లియాతో కలిసి శృతిహాసన్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌ రూపొందిస్తోందట. ఈ సాంగ్‌ని న్యూక్లియా తన కొత్త ఆల్బమ్‌లో చేర్చబోతున్నారట. నవంబర్‌లో ఈ సాంగ్‌ విడుదల కానుంది. తనకు నచ్చిన పనిలో మరో స్టెప్‌ ముందుకు వెళ్లడంలో ఎంత ఆనందం ఉంటుందో అలాంటి అనుభూతిని తాను ఈ స్పెషల్‌ సాంగ్‌ కోసం న్యూక్లియాతో కలిసి పని చేయడం ద్వారా పొందుతున్నానని చెబుతోంది శృతిహాసన్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS