ఆ ఆడియన్స్‌నీ 'లవ్‌'లో పడేసిన 'తేజ్‌'

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'తేజ్‌ ఐ లవ్‌యూ'. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ నుండీ విశేషంగా ఎట్రాక్ట్‌ చేస్తున్నాడు సాయి ధరమ్‌ తేజ్‌. 

తన పేరుతోనే టైటిల్‌ని పెట్టుకోవడం. ఆ టైటిల్‌ చాలా క్యాచీగా ఉండడం, వర్షంలో రొమాంటిక్‌గా కాఫీ తాగుతున్నట్లుగా రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ టీజర్‌ యూత్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేస్తుండడం ఇవన్నీ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పొచ్చు. లేటెస్టుగా విడుదలైన 'ఎన్నో ఎన్నో సంతోషాలే..' సాంగ్‌ ప్రోమో టీజర్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌ని కట్టిపడేసేలా ఉంది. తేజు గతంలో నటించిన 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' సినిమాని తలపిస్తోందీ తాజా టీజర్‌.

 

సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌లో హిట్‌ సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' సినిమాని. ఆ సినిమా కళ ఈ సినిమాకి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అనుపమా పరమేశ్వరన్‌, తేజు జంట కొత్తగా, క్యూట్‌గా ఉంది. కూల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ అనడానికి జస్టిఫికేషన్‌గా ఉందీ లేటెస్ట్‌ టీజర్‌ సాంగ్‌. గోపీసుందర్‌ మ్యూజిక్‌ అందించాడీ సినిమాకి. లవ్‌స్టోరీస్‌ ఎక్స్‌పర్ట్‌ కరుణాకరన్‌ దర్శకత్వం వహించాడు. 

దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస ఫెయిల్యూర్స్‌తో నిరాశ పరుస్తున్న తేజు ఈ సినిమాతో ఖచ్చితంగా ఫ్యాన్స్‌ని శాటిస్‌ఫై చేసేలానే కనిపిస్తున్నాడు 'తేజ్‌ ఐలవ్‌యూ'తో. చూడాలి మరి ఏం చేస్తాడో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS