పూజా హెగ్దే ఈ సారి ఇంకానా?

By iQlikMovies - May 05, 2018 - 18:13 PM IST

మరిన్ని వార్తలు

'డీజె' సినిమాతో హాట్‌ బ్యూటీగా పేరు తెచ్చేసుకుంది పూజా హెగ్దే. ట్రెడిషనల్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పూజా హెగ్దే బాలీవుడ్‌కి వెళ్లి వచ్చాక చేసిన సినిమా 'డీజె'. ఈ సినిమాలో అమ్మడు హాట్‌ హాట్‌ బికినీ షోతో రెచ్చిపోయింది. దాంతో పూజా హెగ్దేలో ఇంత హాట్‌నెస్‌ ఉందా? అని ఓ పక్క ఆడియన్స్‌ అవాక్కవుతూనే, మరో పక్క ఆమె గ్లామర్‌కి ఫిదా అయిపోయారు. 

అయితే ఆశించిన స్థాయిలో 'డీజె' విజయం అందుకోకపోవడంతో అమ్మడి కెరీర్‌ కాస్త స్లో అయినట్లుగా అనిపించినా, ఆ తర్వాత అనూహ్యంగా ఊపందుకుంది. ఆ ఊపులోనే 'రంగస్థలం' ఐటెం సాంగ్‌ 'జిగేల్‌ జిగేల్‌ రాణీ..'తో మ్యాజిక్‌ చేసింది. సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అవ్వడం, పాట మరింత క్లిక్‌ అవ్వడంతో అమ్మడికి క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. ప్రెజెంట్‌ మోస్ట్‌ వాంటెడ్‌ బ్యూటీ అయిపోయింది పూజా హెగ్దే. వరుసగా స్టార్‌ హీరోల సరసన చోటు దక్కించేసుకుంది. అందులో భాగంగానే తాజాగా త్రివిక్రమ్‌ - ఎన్టీఆర్‌ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్దే మోస్ట్‌ గ్లామరస్‌గా కనిపించనుందట. 

ఇప్పటికే బికినీలతో సినిమాలోనే కాకుండా, ఈ మధ్య ఓ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం అమ్మడు చేసిన బికినీ షో మామూలుగా పాపులర్‌ కాలేదు. ఇకపోతే రానున్న కాలమంతా పూజా హెగ్దేదే. ప్రబాస్‌తో ఓ సినిమాలోనూ, మహేష్‌తో మరో సినిమాలోనూ నటిస్తోంది. ఈ రెండూ ప్రిస్టీజియస్‌ అండ్‌ భారీ బడ్జెట్‌ చిత్రాలు కావడం పూజా హెగ్దేకి మరింత కలిసొచ్చే అంశం. 

ఇవన్నీ ఇలా ఉంటే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో పూజా హెగ్దే నటించిన 'సాక్ష్యం' సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS