'డీజె' బ్యూటీ పూజా హెగ్దే ఈ సినిమా స్టార్టింగ్ నుండీ టాకింగ్ ఆఫ్ ది టాలీవుడ్‌గా నిలిచింది. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో కనిపించిన హాట్ అప్పీల్ అలాంటిది. నిజానికి ఈ భామ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు, గతంలో 'ముకుందా' సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్‌తో నటించింది. తర్వాత 'ఒక లైలా కోసం' సినిమాలో నాగ చైతన్యతోనూ నటించింది. ఆ రెండు సినిమాలు అమ్మడికి మంచి పేరే తెచ్చాయి. అయితే 'డీజె' విషయానికి వచ్చేసరికి అమ్మడిలో హాట్ అప్పీల్ బాగా పెరిగిపోయింది. దాంతో ఎక్కడ విన్నా ఈ బ్యూటీ గురించే చర్చ జరుగుతోంది. ఈ రోజు ఈ సినిమా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో పూజా హెగ్దే గ్లామర్ కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ ముద్దుగుమ్మకి 'డీజె' తెలుగులో తొలి కమర్షియల్ హిట్ అని చెప్పొచ్చు. తొలి రెండు సినిమాల్లోనూ క్యూట్‌గా నీట్‌గా ఆకట్టుకున్న ఈ భామ ఈ సినిమాతో హాట్ హాట్‌గా ఎట్రాక్ట్ చేసేసింది. దాంతో కుర్రకారు మొత్తం పూజా హెగ్దే అందానికి దాసోహం అయిపోక తప్పడం లేదు. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. అనుకున్నట్లుగానే సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా పోజిటివ్ టాక్ దక్కించుకుంటోంది.