రేణూ దేశాయ్‌ కొత్త సినిమా కాన్సెప్ట్‌ అదేనా?

మరిన్ని వార్తలు

హీరోయిన్‌, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌ ఎప్పటి నుండో తెలుగులో ఓ సినిమా డైరెక్ట్‌ చేస్తానని చెబుతోంది. అందుకు సరైన టైం కోసం ఎదురు చూస్తున్నానని గతంలో పలు మార్లు చెప్పింది. 

ఆ టైం ఇప్పుడు రానే వచ్చిందనిపిస్తోంది. త్వరలోనే రేణూదేశాయ్‌ దర్శకత్వంలో సినిమా రానుందట. అది ఓ లవ్‌ స్టోరీ అని తెలుస్తోంది. మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీ అట. పెళ్లికి ముందు , పెళ్లి తర్వాత లవ్‌ని తన సినిమాలో చూపించబోతోందట రేణూదేశాయ్‌. ఆలుమగల మధ్య సంఘర్షణ వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండనుందట. ముఖ్యంగా సహజీవనం గురించి కొంత పార్ట్‌ ఈ సినిమాలో ఉంటుందనీ తెలుస్తోంది. ఈ అంశాలు సినిమాపై ఆశక్తిని పెంచుతున్నాయి. కానీ ఇది ఎప్పటికి జరిగేనో తెలియాల్సి ఉంది. 

ఇప్పటికైతే రేణూదేశాయ్‌ తెలుగులో సినిమా చేయబోతున్నానని చెప్పింది. కానీ పూర్తి వివరాలు వెల్లడించలేదు. పైన చెప్పుకున్నవన్నీ జస్ట్‌ గాసిప్సే. ఇదీ స్టోరీ అంటూ ఈ గాసిప్స్‌ స్వైర విహారం చేస్తున్నాయి. ఈ గాసిప్స్‌ వింటుంటే, మొత్తానికి రేణూదేశాయ్‌ తన సొంత స్టోరీనే కొంచెం అటూ ఇటూగా మార్చి సినిమాగా తెరకెక్కిస్తుందేమో అని అందరూ చర్చించుకుంటున్నారు. 

ప్రస్తుతం అయితే రేణూదేశాయ్‌ రెండో పెళ్లి సందడిలో బిజీగా ఉంది. ఇటీవలే నిశ్చితార్ధం చేసుకున్న రేణూదేశాయ్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS