పూజా హెగ్దేకి మరో బంపర్‌ ఛాన్స్‌?

By iQlikMovies - June 13, 2018 - 15:24 PM IST

మరిన్ని వార్తలు

హాట్‌ బ్యూటీ పూజా హెగ్దే ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా బంపర్‌ ఆఫర్స్‌తో దూసుకెళ్లిపోతోంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ మరో మెగా ఛాన్స్‌ కొట్టేసిందనీ తాజాగా టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అదేంటంటే, చరణ్‌ - ఎన్టీఆర్‌ కాంబినేసన్‌లో తెరకెక్కుతోన్న మెగా మల్టీ స్టారర్‌లో పూజా హెగ్దే నటించే అవకాశం దక్కించుకుందట. అయితే ఈ ఇద్దరిలో ఎవరి సరసన పూజా నటింస్తుంది అంటే, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సరసన అని టాక్‌ బాగా వినిపిస్తోంది. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరక్కెబోయే ఈ చిత్రానికి సంబంధించి ఇతర డీటెయిల్స్‌ ఏమీ ఇంతవరకూ బయటికి రాలేదు. వస్తున్న వార్తలన్నీ జస్ట్‌ రూమర్సే. అఫీషియల్‌ డిక్లరేషన్‌ రానివే. 

అయితే తాజాగా స్ప్రెడ్‌ అవుతున్న గాసిప్‌ ప్రకారం ఈ సారి ఫుల్‌ లెంగ్త్‌లో పూజా హెగ్దే, చరణ్‌తో ఆడి పాడనుందనీ తెలుస్తోంది. 'రంగస్థలం'లో జిగేల్‌ జిగేల్‌ రాణీ అంటూ చరణ్‌తో స్పెషల్‌ సాంగ్‌లో చిందేసిన ఈ ముద్దుగుమ్మ ఈ సారి ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో చరణ్‌తో జోడీ కట్టబోతోందట. ఎన్టీఆర్‌తో ప్రస్తుతం 'అరవింద సమేత..' చిత్రంలో పూజా హెగ్దే నటిస్తున్న సంగతి తెలిసిందే. 

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలోనూ పూజా హెగ్దేనే హీరోయిన్‌. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీద పూజా సందడి చేయనుంది. అలాగే ప్రబాస్‌తోనూ ఓ సినిమాలో పూజా నటిస్తోంది. టాలీవుడ్‌లో ఇంత బిజీగా గడుపుతోన్న ఈ బ్యూటీ చేతికి మరో హాట్‌ ఆఫర్‌ దక్కిందంటే, నిజంగా విశేషమే మరి. చూడాలిక ఈ హాట్‌ గాసిప్‌లో నిజమెంతుందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS