జిగేల్‌ రాణి.. ఇష్టమైన కష్టం

మరిన్ని వార్తలు

నాజూకు భామ అనగానే టాలీవుడ్‌లో ఇప్పుడందరికీ పూజా హెగ్దేనే గుర్తుకొస్తోంది. తొలి సినిమా 'ఒక లైలా కోసం' నుంచి, తాజా చిత్రం 'అరవింద సమేత' వరకూ పూజా హెగ్దే పెర్‌ఫెక్ట్‌ ఫిజిక్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తూ వస్తోన్న సంగతి తెల్సిందే. ఆ మాటకొస్తే, సినిమా సినిమాకీ గ్లామర్‌ పెంచుకుంటూ పోతోంది ఈ బ్యూటీ. 

'రంగస్థలం' సినిమాలో 'జిగేలు రాణీ..' అంటూ ఐటమ్‌ సాంగ్‌ చేసేసిన ఈ బ్యూటీ తాజాగా కుంగ్‌ ఫూలో ట్రెయినింగ్‌ తీసుకుంటోంది. ఫిట్‌నెస్‌ అంటే తెగ ఇష్టపడే పూజా హెగ్దే, రకరకాల ఫీట్లు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోల్ని సోషల్‌ మీడియాలో పెడుతుంటుంది. అలా అభిమానులకి ఎప్పుడూ 'టచ్‌'లో వుండడం ఆమెకి అలవాటే. తాజాగా 'కుంగ్‌ ఫూ' శిక్షణకు సంబంధించిన ఫొటోల్ని, ఫిట్‌నెస్‌ వీడియోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది పూజా హెగ్దే. 

ఇంకేముంది, క్షణాల్లో ఇవి వైరల్‌ అయిపోయాయి. ఫిట్‌నెస్‌ పట్ల అందరిలో అవగాహన పెంచేందుకుగాను తనవంతుగా ఇలా చేస్తున్నానని అంటోంది పూజా హెగ్దే. వర్కవుట్స్ చేయడం ఒక్కోసారి కష్టంగా అనిపించినా.. అది ఇష్టంగా చేసుకోవడం వల్లే తాను ఇంత ఫిట్ గా వుంటున్నానని చెబుతుంటుందీ అందాల భామ. ప్రస్తుతం తాను టాలీవుడ్‌లో దాదాపు స్థిరపడిపోయినట్లేననీ, బాలీవుడ్‌ - కోలీవుడ్‌ నుంచి అవకాశాలు వచ్చినా వదులుకోననీ, తన తొలి ప్రిఫరెన్స్‌ మాత్రం తెలుగు సినిమాలకే ఇస్తానని అంటోంది పూజా హెగ్దే. 

'ఒక లైలా కోసం' నుంచి 'అరవింద సమేత' వరకు పూజా హెగ్దేకి. బాగున్నాయి, బాగానే వున్నాయి.. అనే ప్రశంసలు తప్ప, 'సూపర్‌ హిట్‌ సినిమాలో సూపర్‌ హిట్‌ హీరోయిన్‌' అనే గుర్తింపు మాత్రం రాలేదు. సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తోన్న ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతానికి సినిమాలు బాగానే వున్నాయి. ప్రభాస్‌ సరసన చేస్తోన్న సినిమా అయినా ఈ బ్యూటీకి ఆశించిన విజయాన్ని అందిస్తుందా.? వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS