'ట్యాక్సీవాలా' - డ్రైవర్‌గారూ లేటెందుకు.!

మరిన్ని వార్తలు

రౌడీస్‌.. బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ ఫ్రమ్‌ 'రౌడీ' విజయ్‌ దేవరకొండ. తన కొత్త సినిమా 'ట్యాక్సీవాలా' సినిమాని ఒక రోజు లేటుగా 'రౌడీస్‌' ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించాడు ఈ యంగ్‌ హీరో. ఒక్క రోజు లేటుగా వస్తుండొచ్చు.. కానీ, ఫన్‌ రైడ్‌ పక్కా.. అంటూ అభిమానులకు విజయ్‌ దేవరకొండ భరోసా ఇస్తున్నాడు. 

'నోటా' సినిమాని అంతా ఊహించినదానికంటే ముందుగానే రిలీజ్‌ చేశాడు విజయ్‌ దేవరకొండ. అలాంటిది, ఈసారి మాత్రం.. ఒక రోజు లేటవుతున్నాడు. నిజానికి, 'ట్యాక్సీవాలా' ఎప్పుడో విడుదల కావాల్సి వుంది. రిలీజ్‌కి ముందే సినిమాని కొందరు లీక్‌ చేసెయ్యడంతో దర్శక నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. ఎట్టకేలకు నవంబర్‌ 16వ తేదీన 'రిలీజ్‌'కి ప్లాన్‌ చేసినా, అదే రోజు మాస్‌ మహరాజా రవితేజ తన కొత్త సినిమా 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడంతో, విజయ్‌ దేవరకొండ కాస్త వెనక్కి తగ్గినట్లున్నాడు. 

ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన ప్రియాంకా జవాల్కర్‌ హీరోయిన్‌గా నటించింది. రాహుల్‌ సాంక్రిత్యాన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. యువి క్రియేషన్స్‌, జిఎ2 పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. నిర్మాత ఎస్‌.కె.ఎన్‌. 'నోటా' నిరాశపర్చిన దరిమిలా, విజయ్‌ దేవరకొండకి 'టాక్సీవాలా' సూపర్‌ హిట్‌ అవడం అత్యవసరం. 

చూద్దాం, డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న 'ట్యాక్సీవాలా' మళ్ళీ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండని సక్సెస్‌ ట్రాక్‌ మీదకు ఎక్కిస్తుందో లేదో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS