గ్లామ్‌షాట్‌: 'పూల్‌'లో బికినీ పాప 'బ్యాక్‌' చూపించింది!

మరిన్ని వార్తలు

'గోపిక'లా తెలుగు తెరకు పరిచయమైంది. మొన్న ఎన్టీఆర్‌ పక్కన 'అరవింద'గా ఆకట్టుకుంది. నిన్న 'మహర్షి' పక్కన మెరుపు తీగలా మురిపించింది. త్వరలో ప్రబాస్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌తేజ్‌ల సరసన మెరవబోతోంది. ఆమె ఎవరో ఈ పాటికే అర్ధమై పోయి ఉంటుంది. ఇంకెవరు అందాల పూజా హెగ్దే. వరుస సినిమాలతో అదీ స్టార్‌ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ క్రేజీయెస్ట్‌ హీరోయిన్‌ అనిపించుకుంటోంద పూజాహెగ్దే.

 

టాలీవుడ్‌లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నా, బాలీవుడ్‌లోనూ అవకాశాల కోసం ఎదురు చూస్తోందట. పూజా హెగ్దే అక్కడ నటించిన 'మొహంజోదారా' సినిమా ఫెయిల్యూర్‌గా నిలవడంతో బుద్ధిగా టాలీవుడ్‌కి మకాం మార్చేసింది. టాలీవుడ్‌లో ప్రజెంట్‌ స్టార్‌ హీరోయిన్‌ ఛైర్‌ని అధిరోహించేందుకు కొన్ని అడుగుల దూరంలోనే ఉంది పూజాహెగ్దే. ప్రబాస్‌తో నటిస్తున్న 'జాన్‌', అల్లు అర్జున్‌తో జత కడుతున్న 'అలకనంద' (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి.

 

వరుణ్‌తేజ్‌తో రెండోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న పూజా హెగ్దే 'వాల్మీకి' చిత్రం సెప్టెంబర్‌ 6కి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, సినిమాలతో బిజీగా ఉన్నా అమ్మడు సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని మాత్రం వదిలి పెట్టదు. తన జిగేల్‌ గ్లామర్‌తో పూజాహెగ్దే సోషల్‌ ఫాలోవర్స్‌ని ఎప్పటికప్పుడే కలర్‌ఫుల్‌గా ఎంటైర్‌టైన్‌ చేస్తుంటుంది. తాజాగా ఎల్లో కలర్‌ బికినీలో స్విమ్మింగ్‌ పూల్‌లో కూర్చొని ఎలా వయ్యారాలు పోతోందో చూశారుగా. బ్యాక్‌ నుండి ఫోటోకి పోజిస్తూ మరీ మురిసిపోతోంది హాట్‌ హాట్‌ పూజా హెగ్దే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS