పూజా హెగ్డే వెండితెర ఎంట్రీ ఇచ్చింది తమిళ్ లోనే. 'మాస్క్' ఆమె మొదటి సినిమా. ఈ సినిమా డిజాస్టర్. తర్వాత టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసిన బాలీవుడ్ కి వెళ్లి మళ్ళీ 'అరవింద్ సమేత'తో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పాగ వేసింది. అయితే పూజ స్టార్ డమ్ ని తమిళ ఫిల్మ్ మేకర్స్ కి ఇంకా అర్ధమైనట్లు లేదు. పూజని ఇంకా సైడ్ క్యారెక్టర్ గానే భావిస్తున్నారేమో. 'బీస్ట్' చూస్తే అలానే అనిపించింది. రెండు పాటల కోసం తప్పితే పూజా హెగ్డే కి ఇందులో ఎలాంటి ప్రాముఖ్యత లేదు.
చిత్ర దర్శకుడు నెలన్స్ చేసిన రెండు సినిమాల్లో హీరోయిన్ కి మంచి ప్రాధాన్యత వుంది. కానీ బీస్ట్ విషయానికి వస్తే.. అసలు హీరోయిన్ పాత్రతో అవసరమే లేదు. జస్ట్ ఒక సైడ్ క్యారెక్టర్ వుంది. అలాంటి పాత్ర కోసం పూజా ని ఎంపిక చేశారు. విజయ్ సినిమా అనేసరికి పూజా కూడా మరేం అలోచించినట్లు లేదు. సినిమా చూసిన ఆమె ఫ్యాన్స్ కి మాత్రం .. ఇలాంటి పాత్రలు అవసరమా ? ఫీలౌతున్నారు. వరుస హిట్లతో గోల్డన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న పూజాకి రాధేశ్యామ్, బీస్ట్ రూపంలో రెండు ఫ్లాపులు పడ్డాయి. ఇప్పుడు పూజా ఆశలన్నీ ఆచార్యపైనే వున్నాయి.