సమంత తో వర్క్ చేయడం పై రామ్ చరణ్ హాట్ కామెంట్స్

By iQlikMovies - March 19, 2018 - 10:37 AM IST

మరిన్ని వార్తలు

పదేళ్ళ కెరీర్‌లో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ చాలా సినిమాలు చేసేశాడు. అయితే ఇన్నేళ్ళ కెరీర్‌లో సమంతతో నటించేందుకు వచ్చిన చాలా ఛాన్స్‌లు చరణ్‌కి మిస్సయ్యాయి. 

కారణాలేవైతేనేం, సమంత - చరణ్‌ కాంబినేషన్‌లో సినిమాకి చాలా టైమ్‌ పట్టేసింది. చివరికి 'రంగస్థలం' సినిమాతో ఈ ఇద్దరి కాంబినేషన్‌ సెట్‌ అయ్యింది. చిట్టిబాబు పాత్రలో చరణ్‌, రామలక్ష్మి పాత్రలో సమంత చాలా క్యూట్‌గా కన్పిస్తున్నారు. స్టిల్స్‌, ప్రోమోస్‌ చూస్తోంటే సినిమాలు ఈ ఇద్దరి కాంబినేషన్‌ ఏ రేంజ్‌లో వర్కవుట్‌ అయ్యిందో అర్థమయిపోతోంది. సమంతని టీజ్‌ చేయడంలో రామ్‌చరణ్‌, అలా రామ్‌చరణ్‌ టీజింగ్‌ చేసినప్పుడు సమంత పెట్టే బుంగమూతీ అన్నీ బాగా వర్కవుట్‌ అయినట్లే వున్నాయి. 

సమంతతో వర్క్‌ చేయడం గురించి రామ్‌చరణ్‌ చెబుతూ, సెట్‌లో సరదా సరదాగా వుంటుందనీ, ఆమెతో వర్క్‌ చేస్తోంటే కొత్త ఎనర్జీ వచ్చినట్లుంటుందనీ, కొన్ని సార్లు తన నటనతో ఇన్‌స్పైర్‌ చేస్తుంటుందనీ సమంతని ఆకాశానికెత్తేశాడు. వావ్‌ సమంత విషయంలో రామ్‌చరణ్‌ ఇంతలా పొగిడేయడమా? అని అంతా అవాక్కవుతున్నారు. సమంత జస్ట్‌ హీరోయిన్‌ మాత్రమే కాదు, అక్కినేని నాగార్జున కోడలు. నాగార్జున అంటే, చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. చిరంజీవిని నాగార్జున తనయుడు అఖిల్‌ 'పెదనాన్న' అని పిలుస్తాడు. చరణ్‌ని 'అన్నా' అని పిలుస్తాడు. అలా ఇరు కుటుంబాల మధ్యా చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. 

ఆ సంగతి పక్కన పెడితే, సమంత మంచి నటి, ఈ విషయంలో సందేహాలేమీ లేవు. చరణ్‌ 'రంగస్థలం' కోసం ఎంత కష్టపడ్డాడో, సమంత కూడా అంతే కష్టపడాల్సి వచ్చింది. సుకుమారి అయిన సమంత, గోదావరి ఒడ్డున.. చెమటలు కక్కే ఎండల్లో, ఉక్కపోత వాతావరణంలో సినిమా షూటింగ్‌కి కమిట్‌మెంట్‌తో పనిచేసిందంటే చిన్న విషయమా?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS