పూజా హెగ్దేకి అందంతో పాటు అభినయం కూడా ఎక్కువే. అభినయంతో పాటు ఎక్స్పోజింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్స్పోజింగ్ విషయంలో అమ్మడికి అస్సలు మొహమాటం లేదు. పాత్రకి అవసరమైనా, అంతకు మించిన గ్లామర్ అయినా ఒలకబోసేందుకు ఈ హాట్ బ్యూటీ సిద్ధమేనట. 'ముకుందా' స్టోరీకి తగ్గట్లుగా క్యూట్‌గా నీట్‌గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత బాలీవుడ్లో 'మొహంజోదారా' కోసం విచ్చల విడి అందా ప్రదర్శన చేసేసింది. ఈ మధ్య వచ్చిన 'డీజె'లో అయితే అమ్మడి హాట్‌నెస్‌కి ఆకాశమే హద్దయ్యింది. అందుకే అల్లు అర్జున్ అంతగా ఫీలయ్యి నమకం, చమకాలతోనే అమ్మడి అందాలను వర్ణించేశాడు. సినిమాల సంగతి ఇటుంచితే, అమ్మడు సోషల్ మీడియాను కూడా అస్సలు వదిలిపెట్టదు. హాట్ హాట్ పోజులతో కుర్రోళ్ల మతులు పోగొట్టేస్తూ ఉంటుంది. ఈ ఫోటో చూశారుగా, ఇండియన్ గాళ్ అంటూ పోస్ట్ చేసింది. ఫోటోలో చూస్తే హాట్నెస్ శృతి మించిపోయింది. ఫేస్‌లో మాత్రం ఆ క్యూట్‌నెస్ అలాగే ఉంది. అదే పూజా హెగ్దే స్పెషల్. ఫేస్‌లో క్యూట్‌నెస్, ఫిజిక్‌లో హాట్నెస్.. రెండూ యాడ్ చేస్తేనే బ్యూటీనెస్. ప్రస్తుతం ఈ బ్యూటీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో 'సాక్ష్యం' సినిమాలో నటిస్తోంది.