గ్లామ్‌షాట్‌: బీచ్‌లో రిలాక్స్‌ అవుతున్న 'జిగేల్‌ రాణి'.!

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డే పాపులరైంది. ప్రస్తుతం ఆమె చేతిలో బిగ్‌ ప్రాజెక్టులున్నాయి. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో పూజా హెగ్డే నటిస్తున్న 'మహర్షి' సినిమా సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తర్వాత వెంటనే ప్రభాస్‌తో ఓ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది. ఈ రెండూ కాక మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు బాలీవుడ్‌ సినిమాల కోసం కూడా బాగానే ట్రై చేస్తోంది పూజా హెగ్డే. 

 

వీటన్నింటితో పాటు సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గానే ఉంటుంది. ఫిజిక్‌ని మెయింటైన్‌ చేయడానికి రకరకాల కసరత్తులు చేస్తూ కుర్రకారుకు తన అందాలతో తీపి తీపి వలలు విసురుతూ ఉంటుంది. ఇప్పుడయితే వర్కవుట్స్‌ నుండీ, షూటింగ్‌ షెడ్యూల్స్‌ నుండీ కాస్త దూరంగా ఉన్నట్లుంది. బీచ్‌ పక్కన అందాలను ఆస్వాదిస్తూ ఆమె అందాలను ఎరగా వేస్తూ రిలాక్స్‌ అవుతోంది. చూస్తున్నారుగా ఈ పసుపు పచ్చని డ్రస్సులో పూజా ఎంతందంగా కనిపిస్తుందో. ఆ అందాలకు దిష్టి తగలకుండా.. అన్నట్లుగా కాలికి కట్టిన నల్ల పూసల తాడు విశేషంగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS