'బాహుబలి'తో ఇండియన్ సినిమా హిస్టరీనే మార్చేసిన ఘనుడు రాజమౌళి. అలాంటి రాజమౌళి నుండి 'బాహుబలి' తర్వాత వచ్చే సినిమా ఏమై ఉంటుందనే ప్రేక్షకుల ఉత్కంఠకు.. చరణ్, ఎన్టీఆర్‌తో 'ఆర్ఆర్ఆర్' మల్టీస్టారర్‌ని అనౌన్స్ చేసి తెర దించేశాడు. ఇక ఈ సినిమాని ఏదో కమర్షియల్ సినిమాగా తెరకెక్కిస్తాడా.? అంటే కాదు కాదు, ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రమే అని నిర్మాత దానయ్య తేల్చేశారు. 300 నుండి 400 దాకా ఈ సినిమా బడ్జెట్ అని ముందే లెక్క చెప్పేశారు.
అంతేకాదు, మినిమమ్ సినిమాలు తీయడం తనకిష్టముండదనీ, తన ఆలోచనలన్నీ లార్జ్ స్కేల్‌లోనే ఉంటాయనీ రాజమౌళి కూడా తేల్చేశారు. సో 'ఆర్ఆర్ఆర్' బిగ్ మల్టీ స్టారరే కాదు, భారీ నుండి అతి భారీ బడ్జెట్ చిత్రమవుతోందన్న మాటే. అల్లూరి, కొమరం భీమ్ వంటి లెజెండరీ క్యారెక్టర్స్‌ని తీసుకుని మనకు తెలియని, ఇంతకు ముందు చూడని కథని వారిపై అల్లిక అల్లి రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' ద్వారా చూపించబోతున్నారు. చెప్పలేదు చెప్పలేదు అనుకున్నాం.
కానీ ప్రెస్ మీట్ పెట్టి సినిమాకి సంబంధించిన అన్ని విషయాలను డీటెయిల్డ్‌గా చెప్పేసి రంగంలోకి దిగారు రాజమౌళి. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసేశారు. రాజమౌళి గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా చాలా చాలా స్పీడుగా కంప్లీట్ అవుతున్నట్లే. సైలెంట్‌గా రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసేశాడంటే సినిమాని అనుకున్న టైంకే రాజమౌళి కంప్లీట్ చేసేసేటట్టున్నాడు. 2020 జూలైలో 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ అవుతుందని కూడా ముందే చెప్పేశారు రాజమౌళి.