ఎన్టీఆర్‌కి కాదు, చరణ్‌కి ఫిక్యయ్యింది.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ క్యూట్‌ బ్యూటీ ఆలియాభట్‌ తెలుగులో సినిమా అంటూ చేస్తే అది ఎన్టీఆర్‌తోనే అని గతంలో పలు మార్లు చెప్పింది. అయితే సీను రివర్స్‌ అయ్యింది. ఆమె తెలుగులో త్వరలో ఎంట్రీ ఇవ్వబోతోంది.. ఎంట్రీ మూవీ ఆమె భావించినట్లుగా ఎన్టీఆర్‌ మూవీనే. కానీ జస్ట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌. జోడీ మాత్రం ఎన్టీఆర్‌కి కాదు, చరణ్‌తో జత కడుతోంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో పలానా హీరోయిన్‌ అట.. అనే గాసిప్స్‌కి చెక్‌ పెట్టేశారు తాజాగా రాజమౌళి. ఈ సినిమాలోని హీరోయిన్లు పేర్లు రివీల్‌ చేసేశారు. 

 

బాలీవుడ్‌ నుండి అలియాభట్‌నీ, హాలీవుడ్‌ నుండి డైసీని ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎంపిక చేసుకున్నారు రాజమౌళి. అలియాభట్‌ ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా నటిస్తోంది. యంగ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న చరణ్‌కి జోడీగా సీత పాత్రలో ఆలియాభట్‌ నటిస్తోంది. ఈ పాత్ర సినిమాకి అత్యంత కీలకమైన పాత్రల్లో ఒకటి.. వెరీ వెరీ క్రూషియల్‌ క్యారెక్టర్‌ అని రాజమౌళి చెప్పారు. 

 

ఇకపోతే ఎప్పటి నుండో తెలుగులో సినిమా చేయాలన్న బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌ కోరిక నెరవేరింది. కానీ అది ఇలా మారిందన్న మాట. లెజెండరీ ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ స్టోరీ నేపథ్యంలో అన్‌సీన్డ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS