సినిమా నిర్మాణం అంటేనే కోట్లతో పని. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ వస్తే చాలు.. కోట్లు అడుగుతారు. అయితే, యాక్టింగ్ స్కిల్ అండ్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఏం అడిగినా ఎన్ని కోట్లు అడిగినా అర్ధం ఉంది. కానీ పెద్దగా యాక్టింగ్ కూడా రాని హీరోయిన్ కూడా కోట్లు అడిగితే ఏమనుకోవాలి. వచ్చే అవకాశాలు కూడా రావు అనుకోవాలి. కానీ ఇక్కడ స్టార్ డమ్ లేని ఈ క్రేజ్ హీరోయిన్ మాత్రం కోట్ల రూపాయిల భారీ మొత్తాన్ని అడుగుతూ.. భారీ ఆఫర్స్ నే అందుకుంటుంది. ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబుల సినిమాల్లో నటించింది.
ప్రస్తుతం అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఆ హీరోయినే పూజా హెగ్డే. ప్రస్తుతం స్టార్ హీరోల ఫేవరెట్ హీరోయిన్ గా మారింది. అప్పుడెప్పుడో వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఆ చిత్రంతో నటన పరంగా పర్వాలేదనిపించింది కానీ, పూజ కెరీర్ కు మాత్రం ఆ చిత్రం పెద్దగా ఉపయోగపడలేదు. ఆ తరువాత 'ముకుంద' చిత్రంలో నటించినా అది ప్లాప్ అయింది. అయితే ఏం.. వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. మిగిలిన హీరోయిన్స్ కు అసూయ పుట్టేలా ఆఫర్స్ సంపాదిస్తోంది.
పైగా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తోందట. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది పూజా హెగ్డే. ఈ చిత్రానికి గానూ పూజ 2 కోట్ల పారితోషికం తీసుకుందట. అలాగే అఖిల్ సినిమాకి కూడా అంతే ఇవ్వాలని డిమాండ్ చేసి రెండు కోట్లు తీసుకుందట. ప్రభాస్ 20వ సినిమాలో నటిస్తుండటంతో పూజా డిమాండ్ కి ప్రొడ్యూసర్స్ ఒప్పుకుంటున్నారని తెలుస్తోంది.