దిల్‌రాజు అడిగినా.. రిబేటు ఇవ్వ‌లే!

మరిన్ని వార్తలు

పూజా హెగ్డే డిమాండ్ మామూలుగా లేదిప్పుడు. త‌ను ప‌ట్టింద‌ల్లా బంగార‌మే. సౌత్‌లో దుమ్ము దులుపుతున్న పూజా.. నార్త్ లోనూ అవ‌కాశాల్ని చేజిక్కించుకుంటోంది. టాలీవుడ్ లో అత్య‌ధిక పారితోషికం తీసుకునే క‌థానాయిక‌ల్లో త‌న పేరు ముందు వ‌రుస‌లో ఉంటుంది. పూజా మ‌మ‌త్తుని దిల్ రాజు లాంటి వాళ్లే కొనియాడేస్తున్నారు. `పూజా... మ‌న కాజా` అంటూ దిల్ రాజు ఓ ప్రెస్ మీట్లో పూజా క్రేజ్‌ని మాట‌ల్లో వ‌ర్ణించేశారు. `పూజా ఉంటే సినిమా హిట్టే... త‌న కాల్షీట్లు నాక్కూడా కావాలి` అని స‌భావేదిక‌పైనే చెప్పేశారు దిల్ రాజు.

 

ఇంత‌కీ ఈ కాల్షీట్లు ఎందుకోస‌మంటే.. ఎఫ్ 3 కోసం. వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ క‌థానాయ‌కులుగా న‌టించిన చిత్ర‌మిది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో ఓ ఐటెమ్ గీతం ఉంద‌ట‌. ఆ పాట‌లో.. పూజాని తీసుకోవాల‌న్న‌ది దిల్ రాజు ప్లాన్‌. అయితే.. పూజా ఇందుకోసం కోటిన్న‌ర పారితోషికం డిమాండ్ చేసింద‌ట‌. దిల్ రాజు బేర‌మాడినా.. రిబేట్లు లేవ‌ని చెప్పేస్తోంద‌ట‌. ఇటీవ‌ల `పుష్ప‌`లో ఐటెమ్ సాంగ్ కోసం.. స‌మంత‌కు కోటిన్న‌ర ఇచ్చారు. త‌న‌కూ అంతే కావాలని.. డిమాండ్ చేస్తోంద‌ట‌. పూజానే కావాలి అనుకుంటే దిల్ రాజు కోటిన్న‌ర స‌మ‌ర్పించుకోవాల్సిందే. ఆయ‌న దగ్గ‌ర ఇంకో ఆప్ష‌న్ ఉంటే మాత్రం పూజాని ప‌క్క‌న పెట్టేస్తారు. మ‌రి దిల్ రాజు మైండ్ లో ఏం ర‌న్ అవుతుందో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS