అందాల భామ పూజా హెగ్దే మొదట్లో చాలా ట్రెడిషనల్ లుక్‌తో కనిపించింది. నిజంగానే కుర్రకారు గుండెల్లో అందాల లైలాగా గూడు కట్టుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా తన గ్లామర్‌కి మాస్త్ స్పైసీ మాసాలాని దట్టించేసింది. రకరకాల బికినీలతో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసేస్తోంది. దాంతో అమ్మడి బీభత్సమైన హాట్ ఎగ్జిబిషన్‌కి తాళలేక ఏ కుర్రకారు అయితే ఆమెని అంతగా అభిమానించారో, వారే సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
విమర్శలేంటి, చాలా దారుణంగా దుమ్మెత్తి పోసేస్తున్నారు. దాంతో అందాల పూజాకి చిర్రెత్తుకొచ్చేసింది. తనని అలా ఆడిపోసుకుంటున్న వారికి హాట్‌గానే కౌంటర్ ఇచ్చేసింది. 'సెక్సీ ఈజ్ కాన్ఫిడెన్స్', ద్వేషించే వాళ్లు ద్వేషించుకోండి, కానీ అలా నన్ను ఇష్టపడేవాళ్లు ఇష్టపడుతున్నారు అని హ్యాష్ టాగ్‌తో మళ్లీ బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉంది. దాంతో ఇంకేం చేస్తారు. ఎవరి దారి వారిదే అన్నట్లుగా, ఆమె కౌంటర్ ఎటాక్‌కి, రివర్స్ కౌంటర్ ఎటాక్స్ కూడా పడుతున్నాయి.
ఏది ఏమైనా ఇప్పుడు పూజా హెగ్దే స్టార్ హీరోయిన్ రేస్‌లో దూసుకెళ్లిపోతోంది. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్దే ఇప్పుడు. ఎన్టీఆర్, మహేష్, ప్రబాస్ వంటి స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారిందీ భామ. ఆల్రెడీ మెగా పవర్‌స్టార్‌తో 'రంగస్థలం'లో తన జిగేల్ తళుకులతో మెప్పించేసింది. తన స్టార్ గ్రాఫ్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఈ ముద్దుగుమ్మ ఏం చేసినా చెల్లిపోతుంది మరి.