ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డులలో బాహుబలి చిత్రాన్ని మూడు అవార్డులు వరించాయి.
అయితే అందులో ప్రకటించిన బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ క్యాటగిరిలో బాహుబలి చిత్రానికి పనిచేయని ఒక పేరుని ప్రకటించడంతో అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశాన్ని బాహుబలి నిర్మాత అయిన శోభు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.
అలాగే బాహుబలి చిత్రానికి ప్రజాదరణ పొందిన చిత్రంగా, విజువల్ ఎఫెక్ట్స్ అంశాలలో జాతీయ అవార్డులు వచ్చాయి. దీనితో ఈ చిత్రానికి అటు కలెక్షన్స్ పరంగా ఇటు అవార్డుల పరంగా సరైన ప్రాధాన్యం గుర్తింపు దక్కింది అనే చెప్పొచ్చు. రెండేళ్ళ క్రితం బాహుబలి మొదటి పార్ట్ కి జాతీయ ఉత్తమ చిత్రం వచ్చిన సంగతి విదితమే.
ఇక మరి ఈ తప్పు ఎలా జరిగింది అన్నది ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.