క్రేజీ బ్యూటీ పూజా హెగ్దే టైటిల్ రోల్ పోషిస్తోన్న సినిమా 'అరవింద సమేత..'. ఆమె పేరు మీదే ఈ సినిమా టైటిల్‌ని పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమాకి ఇలా హీరోయిన్ పేరు మీద టైటిల్ పెట్టడమేంటని మొదట్లో అభిమానులు కాస్త చిన్నబుచ్చుకున్నారు. అయితే ఈ సినిమాలో పూజా హెగ్దే పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉండబోతోందట.
సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంటుందట. ఆ ట్విస్ట్‌కి పూజా హెగ్దే క్యారెక్టర్ ఓ కారణమని అంటున్నారు. అందుకే టైటిల్ అలా పెట్టాల్సి వచ్చిందనీ చిత్రయూనిట్ ద్వారా అందుతోన్న సమాచారమ్. మామూలుగానే త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ క్యారెక్టర్స్‌కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే హీరోయిన్ పేరు మీదుగా టైటిల్ పెట్టిన 'అరవింద సమేత..'లో పూజా హెగ్దే పాత్రకు అభిమానులు నిజంగా అవాక్కవడం ఖాయమంటున్నారు.
'రంగస్థలం'లో 'జిగేల్ రాణీ' పాటతో పూజా హెగ్దే ఎంత క్రేజ్ సంపాదించిందో అంతకు మించిన క్రేజ్‌ని 'అరవింద సమత..'తో సంపాదించుకుంటుందట పూజా. మరో హీరోయిన్ ఈషా రెబ్బ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇంతవరకూ చిన్న చిన్న సినిమాలతోనే ఓ మోస్తరు పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ తొలిసారి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది ఈ సినిమాతో. తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినా అందరి దృష్టినీ ఆకర్షించేలా ఉండబోతోందట ఈ సినిమాలో ఈషా రెబ్బ క్యారెక్టర్.
ఇలా ఇద్దరు హీరోయిన్ల సమేత వీర రాఘవుడు అక్టోబర్ 11న ప్రేక్షుల ముందుకు రానున్నాడు.