'ముకుందా' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని క్యూట్‌గా పలకరించిన బ్యూటీ పూజా హెగ్దే. తన హైటూ, పర్సనాలిటీకి ఏ కాస్ట్యూమ్ అయినా చక్కగా సెట్ అయిపోతుంది. ట్రెడిషనల్ వేర్‌లోనూ అద్దినట్టుంటుంది. అలాగే మోడ్రన్ వేర్కీ సరిపోతుంది ఆమె ఫిజిక్. అయితే ఇప్పుడే భామ తాజాగా నటిస్తున్న చిత్రం 'సాక్ష్యం'. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా ఈ సినిమాలో పూజా హెగ్దే పాత్రేంటో తెలుసా? ఓ బ్రాహ్మిణ్ అమ్మాయి. 'డీజె - దువ్వాడ జగన్నాధమ్' సినిమాలో బ్రాహ్మణ యువకుడు పాత్రలో నటించిన అల్లు అర్జున్‌కి జోడీగా అల్ట్రా మోడ్రన్ అమ్మాయిగా నటించిన పూజా ఇప్పుడు తాను కూడా బ్రాహ్మిణ్ అమ్మాయి అవతారమెత్తింది. ఈ ముద్దుగుమ్మది క్లాసిక్ ఫేసే. సో ఈ క్యారెక్టర్ని బాగానే డీల్ చేయగలదంటున్నారు. పూజా హెగ్దే క్యారెక్టర్ని డైరెక్టర్ సరికొత్తగా డిజైన్ చేశాడట.
'డీజె'లో పిచ్చ పిచ్చగా గ్లామర్ ఒలకబోసిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో కాస్త గ్లామర్ డోస్ తగ్గించిందనీ తెలుస్తోంది. అయితే ట్రెడిషనల్ వేర్లో అయినా కానీ సినిమాకి కావల్సినంత గ్లామర్‌ని పండించిందనీ మరోపక్క సమాచారమ్. ఏది ఏమైనా పూజా హెగ్దేకి గ్లామర్ విషయంలో మొహమాటాలు లేవు కానీ, అంతగా ఓవర్ డోస్‌లో గ్లామర్ పండించిన సినిమా అంటే 'డీజె' అనే చెప్పాలి. అయితే అంత గ్లామర్ ఒలకబోసినా, అమ్మడికి ఆ సినిమా సక్సెస్ తెచ్చిపెట్టకపోవడం బాధాకరం. కానీ 'సాక్ష్యం' సినిమాలో ఏదో గ్లామర్ కోసమే అన్నట్లుగా కాకుండా, పూజా క్యారెక్టర్‌కి బాగా ఇంపార్టెన్స్ ఉండబోతోందట.
బ్రాహ్మిణ్ యువతిగా హావభావాలు, బాడీలాంగ్వేజ్నీ ముందుగానే ఈ ముద్దుగుమ్మ ప్రాక్టీస్ చేసిందట. సో పూజా నటించిన సన్నివేశాలు చాలా బాగా వస్తున్నాయట. సమ్మర్ కానుకగా ఈ సినిమాను మేలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.