'డీజె - దువ్వాడ జగన్నాధమ్' సినిమాతో హాట్ హాట్ బికినీలతో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ పూజా హెగ్దే తర్వాత 'రంగస్థలం'లో జిగేల్ రాణీ అంటూ స్పెషల్ సాంగ్‌లో తళుక్కున మెరిసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం. అందులోనూ, ఈ సాంగ్ పిచ్చ పిచ్చగా హిట్ అయిపోవడంతో అమ్మడు తెగ పాపులర్ అయిపోయింది.
వరుస పెట్టి ఎన్టీఆర్, ప్రబాస్, మహేష్ వంటి స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించేసుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో 'అరవింత సమేత'లో నటిస్తోంది. మరోవైపు ప్రబాస్, మహేష్ సినిమాలు త్వరలోనే పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే తాజాగా పూజా హెగ్దే నటించిన 'సాక్ష్యం' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్‌గా తొలి సినిమా 'ముకుందా'తో చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకున్న పూజా హెగ్దే, తర్వాత వచ్చిన 'ఒక లైలా కోసం' కూడా హిట్ లెక్కల్లోకే వెళుతుంది. అలాగే 'డీజె'ను కూడా ఫెయిల్యూర్ లెక్కలో వేయలేం. ఇలా చెప్పుకుంటూ పోతే హీరోయిన్‌గా హిట్ ట్రాక్ రికార్డునే సంపాదించేసింది పూజా హెగ్దే.
ఈ ట్రాక్ రికార్డుతోనే ఇప్పుడు రాబోతున్న 'సాక్ష్యం' సినిమాపై కూడా భారీ అంచనాలు నమోదవుతున్నాయి. స్టార్‌డమ్ పరంగా చూస్తే బెల్లంకొండకు పెద్దగా స్టార్‌డమ్ లేకున్నా, పూజా ఇమేజ్‌తో ఈ సినిమాకి ప్లస్ అయ్యేలా ఉంది. విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న 'సాక్ష్యం' స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా బాహుబలి తర్వాతి ప్లేస్‌లో నిలుస్తుందని భావిస్తున్నారు.
శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కర్మ సిద్దాంతం అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కుతోంది.