టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అయిపోయింది పూజా హెగ్డే. తను కనిపిస్తే చాలు..సినిమా హిట్టే అంటున్నారు జనాలు. అందుకే తనకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ లక్కీ ఛార్మ్‌ని.. ఎఫ్ 3లోకి లాక్కొచ్చారు దిల్ రాజు.
వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించిన చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకుడు. షూటింగ్ మొత్తం అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ ని జోడించనున్నారు. పూజా హెగ్డేతో ఈ పాట ప్లాన్ చేశారు. మే తొలి వారంలో ఈ పాటని హైదరాబాద్‌లో తెరకెక్కిస్తారు. అందుకోసం ఓ భారీ సెట్ ని తీర్చిదిద్దుతున్నారు. `రంగస్థలం`లో పూజా జిగేల్ రాణిగా మెరిసిన సంగతి తెలిసిందే. ఆ పాట సూపర్ హిట్. ఆ తరవాత పూజా ఐటెమ్ పాట చేసింది లేదు. ఇప్పుడు .. ఎఫ్ 3 కోసం ఐటెమ్ గాళ్ అవతారం ఎత్తనుంది. ఈ పాట కోసం పూజా భారీ పారితోషికం తీసుకుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.