పునర్నవి కోసం రాహుల్‌ ఏం చేశాడో తెలుసా.?

మరిన్ని వార్తలు

కాకరకాయను చూస్తేనే నోరు చేదెక్కిపోతుంది. కాకరకాయ జ్యూస్‌.. అంటే అక్కడే వాంతులొచ్చేస్తాయి. కానీ, పునర్నవి కోసం రాహుల్‌ ఏం చేశాడో తెలుసా? ఆ కాకరకాయ జ్యూస్‌ని చాలా ఇష్టంగా తాగేశాడు. ఇష్టమైన వ్యక్తుల కోసం ఎంత కష్టమైనా భరించేయొచ్చు.. అన్నదానికి ఇంత కన్నా బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ ఇంకేమైనా ఉంటుందా? చెప్పండి. ఒక్క గ్లాసు కాదు, ఏకంగా 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్‌ తాగి, పునర్నవిని ఎలిమినేషన్‌ నుండి సేఫ్‌ చేశాడు రాహుల్‌.

 

బిగ్‌బాస్‌ తాజా ఎపిసోడ్‌లో డైరెక్ట్‌ నామినేషన్స్‌ ప్రక్రియ జరిగింది. ప్రతీ ఇంటి సభ్యున్ని బిగ్‌బాస్‌ డైరెక్ట్‌గా నామినేట్‌ చేసి, బిగ్‌బాస్‌ సూచన మేరకు మరో ఇంటి సభ్యుడు నామినేట్‌ అయిన సభ్యుని కోసం బిగ్‌బాస్‌ చెప్పిన టాస్క్‌ కంప్లీట్‌ చేస్తే వారు ఎలిమినేషన్‌ నుండి సేఫ్‌ అవుతారు.. ఇదీ ఈ టాస్క్‌ సారాంశం. అలా పునర్నవిని నామినేషన్‌ నుండి తప్పించడానికి రాహుల్‌కి అత్యంత కఠినమైన కాకరకాయ జ్యూస్‌ టాస్క్‌ ఇచ్చారు బిగ్‌బాస్‌. అత్యంత కష్టమైన టాస్క్‌ ఇది. కానీ, నేను చేస్తాను.. అని పునర్నవికి భరోసా ఇచ్చాడు రాహుల్‌. అది సాధ్యపడేది కాదు.. ఆలోచించుకో అని పునర్నవి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. పట్టు పట్టిన విక్రమార్కుడిలా టాస్క్‌ కంప్లీట్‌ చేసి పునర్నవి మనసు దోచేశాడు. ఒక్క త్యాగంతో ఆమె నోరు మూయించేశాడు.

 

నిజంగానే రాహుల్‌ త్యాగానికి అందరూ విస్మయం చెందారు. వాస్తవానికి రాహుల్‌, పునర్నవి మధ్య గిల్లికజ్జాలు నడుస్తున్నాయి. మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌. అలాంటిది బిగ్‌బాస్‌ ఇచ్చిన తాజా టాస్క్‌ వారిద్దరి మధ్య ఏర్పడిన విబేధాలను తొలగించేసేలా చేసింది. టాస్క్‌ కంప్లీట్‌ చేసి వచ్చిన రాహుల్‌ని ప్రేమగా హత్తుకుని, ముద్దు కూడా ఇచ్చేసింది పునర్నవి. తాజాగా చోటు చేసుకున్న రాహుల్‌ - పునర్నవి ఈ ఎపిసోడ్‌ వీక్షకుల్ని ఎక్కడో టచ్‌ చేయడంతో పాటు, ఎంజాయ్‌ చేసేలా చేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS