పాప బాగా బిజీ: గుడ్‌ టైం నడుస్తోందిగా!

మరిన్ని వార్తలు

గెస్ట్‌ రోల్‌ అయినా గట్టిగా కొట్టింది 'గద్దలకొండ గణేష్‌'తో జిగేల్‌ రాణి. కథ పరంగా ఆమె పాత్రకు నిడివి చాలా తక్కువ. కానీ, క్యారెక్టర్‌ పరంగా ఆమె పాత్రకు ఇంపార్టెన్స్‌ చాలా ఎక్కువ. ఏదేమైతేనేం, హిట్‌ పరంగా సూపర్‌ హిట్‌ కొట్టిందంతే. ఈ ఏడాది ఆల్రెడీ పూజా హెగ్దే కెరీర్‌లో 'మహర్షి' రూపంలో ఓ హిట్‌ ఉంది. దానికి తోడు ఇప్పుడు 'గద్దలకొండ గణేష్‌' జాయిన్‌ అయ్యింది.

 

ఇక తదుపరి ఆమె చేతిలో చాలానే ప్రాజెక్టులున్నాయి. ప్రబాస్‌, అల్లు అర్జున్‌, అఖిల్‌.. ఇలా పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. అన్నీ సెట్స్‌ పైనే ఉన్నాయి. ఇక ఒక్కొక్కటిగా విడుదల కావడమే తరువాయి. ప్రబాస్‌తో నటిస్తున్న 'జాన్‌' సినిమా ఆల్రెడీ రెండు, మూడు షెడ్యూల్స్‌ కంప్లీట్‌ చేసుకుంది. 'జిల్‌' ఫేం రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే క్యారెక్టర్‌కి చాలా చాలా ఇంపార్టెన్స్‌ ఉండనుందట. ఇక అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురములో' సంగతి చెప్పనే అక్కర్లేదు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాల్లో హీరోయిన్స్‌ పాత్రకు ఎప్పుడూ ఇంపార్టెన్స్‌ ఎక్కువే.

 

అలాంటిది స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్దే పాత్రను ఇంకెంత కొత్తగా, ఇంకెంత వెయిట్‌తో డిజైన్‌ చేసి ఉంటాడో కదా. అలాగే అఖిల్‌ తాజా చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్‌గా ఎంపికైన సంగతి ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అఖిల్‌ సినిమాకి పూజానే మెయిన్‌ అట్రాక్షన్‌ అవ్వాలి. అందుకే పూజా హెగ్దే చుట్టూనే కథ నడుస్తుందని తెలుస్తోంది. అవును నిజమే అఖిల్‌ సినిమాని నిలబెట్టాల్సిన పెద్ద బాధ్యత ఇప్పుడు పూజా పైనే ఉంది మరి. ఇలా చెప్పుకుంటూ పోతే, పూజా హెగ్దే ఖాతా నుండి ఒక్కొక్క ఆణిముత్యం తెరంగేట్రం చేయడానికి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ చేసుకోవాల్సిందే ఆడియన్స్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS