సందీప్‌ కిషన్‌ ఖాతాలో ఇంకోటి.?

మరిన్ని వార్తలు

ఇటీవల 'నిను వీడని నీడను నేనే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌. ఈ సినిమా రిజల్ట్‌తో సందీప్‌ కాస్త ఊరట పొందిన సంగతి తెలిసిందే. ఇదే జోష్‌తో త్వరలో 'తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్‌'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కామెడీ సినిమాలకు పెట్టింది పేరైన జి.నాగేశ్వర్‌రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. ఇంతకు ముందు నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో కన్నా, డబుల్‌ డోస్‌ కామెడీని ఈ సినిమాలో చొప్పించారట.

 

లాయర్‌గా నటిస్తున్న సందీప్‌ కిషన్‌తో ఫుల్‌ ఆఫ్‌ ఫన్‌ క్రియేట్‌ చేయనున్నాడట. సందీప్‌ కిషన్‌ కెరీర్‌లో సూపర్‌ హిట్‌ అంటే 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' సినిమానే ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటుంది. ఆ సినిమాలో ఫన్‌ అండ్‌ ఎమోషన్‌ అలాంటిది. మళ్లీ అదే మ్యాజిక్‌ ఈ సినిమాతో చేయనున్నాడనీ తెలుస్తోంది. ఈ సినిమాలో సందీప్‌కి జంటగా హన్సిక నటిస్తోంది. చాలా గ్యాప్‌ తర్వాత హన్సిక తెలుగులో నటిస్తున్న చిత్రం కూడా ఇదే. ఇక ఈ సినిమాలో లేడీ విలన్‌గా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటిస్తోంది.

 

ఈమె పాత్ర యాజ్‌ యూజ్‌వల్‌ పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేశారట. కానీ, వరలక్ష్మికి, హీరోతో వచ్చే కాంబినేషన్‌ సీన్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయట. ఆమెని ఇంతవరకూ సీరియస్‌ రోల్‌లోనే చూశాం. అయితే ఈ సినిమాలో కొత్త యాంగిల్‌ చూడబోతున్నామట. అక్టోబర్‌ 18న ఈ సినిమాని విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్‌ ఉంది. ప్రస్తుతం నెలకొన్న పోజిటివ్‌ బజ్‌తో ఈ సినిమా సందీప్‌ ఖాతాలో మరో హిట్‌ సినిమా అవుతుందేమో అని భావిస్తున్నారు. చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS