బాలీవుడ్లో బుట్టబొమ్మ మరో బంపర్ ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ కండవీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించే సూపర్ ఛాన్స్ కొట్టేసింది. మొన్నీ మధ్యనే ‘హౌస్‌ఫుల్ 4’లో ఖిలాడీ అక్షయ్ కుమార్‌తో హాట్ హాట్‌గా రొమాన్స్ చేసిన పూజా హెగ్దే ఈ సారి కండల వీరుడినే ఇంప్రెస్ చేసేసింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కబీ ఈద్ కబీ దివాళీ’లో హీరోయిన్గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. వచ్చే ఏడాది ఈద్‌కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ‘దబాంగ్ 3’తో సూపర్ హిట్ కొట్టి ఫుల్ స్వింగ్ మీదున్నాడు సల్మాన్ ఖాన్. ఇక బుట్టబొమ్మగా టాలీవుడ్‌ని ఊపు ఊపేస్తోంది పూజా హెగ్దే.
ఈ ఇద్దరు ఇప్పుడు బాలీవుడ్‌ని షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. లేటెస్టుగా అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో..’ సినిమా సూపర్ హిట్ పూజా హెగ్దే కీల క పాత్ర పోషించిందనడం అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం ప్రబాస్‌తో ‘జాన్ (వర్కింగ్ టైటిల్)’ చిత్రంలో నటిస్తున్న పూజాకి తాజా బాలీవుడ్ ఆఫర్ మరింత బూస్టప్నిచ్చిందనాలి. ఈ జోరు చూస్తుంటే, బాలీవుడ్‌లోనూ ఇకపై పూజా హెగ్దే బిజీ అయిపోనుందనిపిస్తోంది. హృతిక్ రోషన్‌తో ‘మొహంజోదారో’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించిన పూజా హెగ్దే తొలి ప్రయత్నంలోనే పరాజయాన్ని చవి చూసింది. దాంతో అక్కడ నిలదొక్కుకోలేకపోయింది.
మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవల ‘హౌస్‌ఫుల్ 4’తో అక్కడి ప్రేక్షకుల్ని మెప్పించగలిగింది. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు, ఈ సినిమా ప్రమోషన్స్‌లోనూ పూజా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచి అక్కడి ప్రేక్షకుల మనసు దోచేసింది. చూడాలి మరి సల్మాన్‌తో ‘కబీ ఈద్ కబీ దివాళీ’ పూజా బాలీవుడ్ కెరీర్‌ని టర్న్ చేస్తుందేమో.