తాప్సీ సినిమాని ప్రశంసించిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ.!

మరిన్ని వార్తలు

మరోసారి తాప్సీ పన్నుకి ప్రముఖుల ప్రశంసలు దక్కాయి. బాలీవుడ్‌లో హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌తో తాప్సీ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. వరుసగా లేడీ సపోర్టింగ్‌ స్టోరీస్‌లో నటించే అవకాశాు దక్కించుకుంటూ తనదైన స్టార్‌డమ్‌ దక్కించుకుంది బాలీవుడ్‌లో తాప్సీ. ఒక్క మాటలో చెప్పాంటే, హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన తాప్సీ ఖాతాలో ప్రస్తుతం మరో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ వచ్చి చేరింది ‘థప్పడ్‌’ రూపంలో. ‘థప్పడ్‌’ అంటే ‘చెంపదెబ్బ’ అని అర్ధం. గృహహింస నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవలే రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో లేటెస్ట్‌గా ఈ ట్రైలర్‌కి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ‘స్త్రీపై చెయ్యి ఎత్తడం సరికాదనీ, అలాంటప్పుడు ఆమె ఒక్క చెంప దెబ్బతో సమాధానం చెప్పగలదు.. భార్యా భర్తలిరువురిలో భార్య మాత్రమే అన్నింటికీ సర్దుకుపోవాలి..’ అనే ధోరణి మారాలనీ సాటి స్త్రీగా ఆమె కోరుకున్నారు. తాప్సీ నటించిన ‘థప్పడ్‌’ ట్రైర్‌ చూసి చాలా ఆనందం వేసిందనీ ఈ సినిమాని తాను ఖచ్చితంగా చూస్తాననీ ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ సినిమా ‘థప్పడ్‌’ అని ఈ సినిమా ట్రైలర్‌ని తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా షేర్‌ చేస్తూ, గౌరవనీయ కేంద్రమంత్రివర్యులు స్మృతీ ఇరానీ పేర్కొనడం విశేషం. తాప్సీ సినిమాకి ఏకంగా కేంద్రమంత్రి నుండే ఇంత గొప్ప సపోర్ట్‌ దక్కడం నిజంగా గొప్ప విషయమే. అన్నట్లు తాప్సీ గతంలో నటించిన ‘పింక్‌’ మూవీని పవన్‌ కళ్యాణ్‌ లీడ్‌ రోల్‌లో తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS