ముకుంద సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ పూజా హెగ్డే. రీసెంట్ గా 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో అల్లు అర్జున్ తో జతకట్టింది. ఇటీవల జరిగిన ఓ వేడుకలో అల్లు అర్జున్ పై ప్రశంశల వర్షం కురిపించింది.
విజయవాడ లో జరిగిన లాట్ మొబైల్స్ ప్రారంభ వేడుకలో పాల్గొన్న పూజా అభిమానులతో సరదాగా సెల్ఫీ దిగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతేకాకుండా అక్కడ బన్నీ గురించి మాట్లాడుతూ బన్నీ కి డాన్స్ లో పోటీ ఎవరూ లేరని చెబుతూ, ఆయనని ఆంధ్రా మైఖేల్ జాక్సన్ గా అభివర్ణించింది. అల్లు అర్జున్ తో 'డీజే' లో నటించటం తన అదృష్టమని, మరోసారి అవకాశం వస్తే స్క్రిప్ట్ కూడా చదవకుండానే ఓకే చెప్తానని చెప్పింది పూజా.
ఇక పూజా విషయానికొస్తే ఆమె 'డీజే' సినిమా ద్వారా అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదే కాకుండా మరికొందరు టాలీవుడ్ యంగ్ హీరోల సినిమాలో నటించే అవకాశం ఉంది.