'వాల్మీకి'లో పూజా ఏం చేస్తుందో తెలుసా!

By iQlikMovies - July 27, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

'వాల్మీకి' ఓ స్పెషల్‌ ఫిలిం. తమిళ 'జిగర్తాండ'కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించి, తమిళ వెర్షన్‌లో కథ మూలాన్ని మాత్రమే తీసుకున్నారట డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌. తెలుగు వెర్షన్‌ పూర్తి డిఫరెంట్‌గా ఉండబోతోందట. వరుణ్‌తేజ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిజానికి హీరో తమిళ కుర్రోడు అధర్వ. వరుణ్‌ పాత్ర నెగిటివ్‌ షేడ్స్‌తో కూడుకొని ఉంటుంది. అలా అని విలన్‌ అయితే కాదట. ఈ పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతోందని తమిళ వెర్షన్‌ చూసిన వారికి ఓ ఐడియా ఉంటుంది.

 

ఇక గెటప్‌ విషయానికొస్తే, ఆల్రెడీ చూసేశాం. వరుణ్‌ గెటప్‌కే హాఫ్‌ సెంచరీ మార్కులు పడిపోయాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్‌ గురించి. హీరోయిన్‌గా పూజా హెగ్దే నటిస్తోన్న సంగతి తెలిసిందే. పూజాహెగ్దే - వరుణ్‌తేజ్‌ కాంబోలో డెబ్యూ మూవీ 'ముకుందా' సూపర్‌ హిట్‌ అందుకుంది. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న పూజా హెగ్దేకి హరీష్‌ శంకర్‌ 'డీజె' ఛాన్సివ్వడం, అందులో పూజాని సూపర్‌ హాట్‌గా చూపించేడయం, ఆ తర్వాత సినిమా సక్సెస్‌తో సంబంధం లేకుండా, పూజా క్రేజ్‌ అమాంతం పెరిగిపోవడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి.

 

'డీజె'కి ముందు వరకూ హోమ్లీగా కనిపించిన పూజాని బికినీల్లో హాట్‌గా చూపించి, అంత గొప్ప గ్లామర్‌ యాంగిల్‌ ఆమెలో ఉందని తెలియచెప్పిన డైరెక్టర్‌ హరీష్‌ శంకరే. హరీష్‌, వరుణ్‌, పూజా కాంబినేషన్‌లో రెండోసారి రూపొందుతోన్న చిత్రం 'వాల్మీకి'. ఈ సినిమాలో పూజా హెగ్దే పాత్రకు ఎక్కువ నిడివి ఉండదట. అయినా కానీ, వరుణ్‌, హరీష్‌తో ఉన్న ప్రత్యేకమైన అనుబంధంతోనే పూజా ఈ సినిమాకి ఒప్పుకుందట. నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఈ సినిమాలో పూజా క్యారెక్టర్‌ చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS