పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఎన్నికల కోసం సర్వ సన్నద్ధమవుతున్నాడు. సరిగ్గా ఈ టైంలో ఆయన నెత్తిన ఓ పిడుగు పడేలా కనిపిస్తోంది. ఆ పిడుగు పేరు పూనమ్ కౌర్. నిజానిజాల సంగతి పక్కన పెడితే, పూనమ్ కౌర్ పేరుతో ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నేను కానీ నోరు విప్పానంటే జనసేన పార్టీ అడ్రస్ లేకుండా పోతుందంటూ అందులో ఆమె పేర్కొంది. నిజంగానే అది పూనమ్ వాయిస్‌యేనా.? కాదా.? అనే దానిపై భిన్న వాదన ఉంది.
మరోపక్క అత్యంత వ్యూహాత్మకంగా ఈ ఆడియో క్లిప్‌ని ప్రత్యర్ధులు తయారు చేశారనీ తెలుస్తోంది. పోలింగ్‌కి కొద్ది రోజులు ముందు అసలు బాంబు పేల్చబోతున్నారట. మరో పక్క రేణూ దేశాయ్ రూపంలో థ్రెట్ పొంచి ఉంది పవన్ కళ్యాణ్‌కి. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. తట్టుకుని నిలబడగలగాలి. అయితే ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ మీదే ఇలాంటివి పుడుతున్నాయి.. అదే పవన్ అభిమానులకు అర్ధం కావడం లేదు.
గతంలో చిరంజీవిని రాజకీయంగా అణగదొక్కేందుకు ఇలాంటి ప్రయత్నాలు చాలా జరిగాయి. అయితే ఆ ప్రయత్నాల కథ వేరు. ఇప్పుడు జరుగుతున్నది వేరు. రాజకీయ కుట్రలు మాత్రం ఒకటే. అసలు పూనమ్‌కీ, పవన్‌కళ్యాణ్‌కీ సంబంధం ఏంటీ.? ఆడియో క్లిప్‌తో చెబుతున్నట్లుగా చాలా మందితో పవన్ కళ్యాణ్‌కి అక్రమసంబంధాలు ఉన్నాయా.?