ఆంధ్రప్రదేశ్‌లో చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్ కౌర్ పేరు వినిపస్తున్నా, అదెంతవరకు నిజం? అనే ప్రశ్న చుట్టూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓ వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి, పూనమ్ కౌర్ ఓ బహుమతిని అందజేస్తే ఆ బహుమతికి మురిసిపోయిన చంద్రబాబు, పూనమ్ కౌర్‌ని ఆంధ్రప్రదేశ్‌లో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆ వేదికపై ఉన్న ఓ మంత్రి క్లాప్స్ కొట్టారు కూడా. ఆ మంత్రిగారే ఆమెకు ఆ ఛాన్స్ వచ్చేలా చేశారని సమాచారమ్.
అదలా ఉంటే, కత్తి మహేష్ - పవన్‌కళ్యాణ్ అభిమానుల వివాదంలోకి పూనమ్ ఎంటర్ అవడంతో సీన్ రసవత్తరంగా మారింది. పూనమ్ ట్వీట్లతో రెచ్చిపోయిన కత్తి మహేష్, ఆమె మీద వ్యక్తిగత ఆరోపణల స్థాయిదాకా దిగజారిపోయాడు. ఏమనుకుందో, వివాదానికి ముగింపు పలికేందుకు పవన్‌కళ్యాణ్ సాయం కోరింది పూనమ్ కౌర్. ఇంతలోనే తెలుగుదేశం పార్టీ నుంచి ఓ ప్రకటన వచ్చింది. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవర్నీ నియమించలేదని చెప్పారు.
దాంతో పూనమ్ కౌర్ కి చాలా పెద్ద షాక్ తగిలినట్లయ్యింది. ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత నియామకం జరగలేదని మంత్రిగారు అనడం ఆశ్చర్యకరం. అయినప్పటికీ కూడా అధికారికం అయితేనే ఆ పదవి దక్కినట్లు. పదవిలో ఇప్పుడు పూనమ్ ఉందో లేదో తెలియదు. కానీ ఆ పదవి కోసం పూనమ్ పడ్డ పాట్లు.. అని ఆరోపిస్తూ చాలా యాగీ జరిగింది. ఇప్పుడు పూనమ్ తాను బ్రాండ్ అంబాసిడర్‌నో కాదో తెలుసుకోవాల్సి ఉంది.