సెక్సీ బాంబ్ పూనమ్ పాండే ఇంకోసారి క్రిస్మస్కి గట్టిగా పేలింది. ప్రతిసారీ క్రిస్మస్ సందర్భంగా ఏదో ఒక హాట్ బాంబ్ పేల్చడం పూనమ్ పాండేకి అలవాటే. 'జింగిల్ బూబ్స్..' అంటూ క్రిస్మస్ ఉద్దేశ్యాన్నే మార్చేసేందుకు ప్రయత్నించి, చాలా విమర్శలు, వివాదాలు ఎదుర్కొన్నా పూనమ్ పాండే మాత్రం తన రూట్ మార్చుకోవడంలేదు.
తాజా క్రిస్మస్ కోసం శాంటా గెటప్‌లో పూనమ్ పాండే చేసిన సెమీ న్యూడ్ షో అంతా ఇంతా కాదు. ఓ వీడియో పూనమ్ పాండే నుంచి క్రిస్మస్ కానుకగా విడుదలై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోందిప్పుడు. ప్రతిసారీ చూసే ఫిగరే అయినా, ఎప్పుడు చూసినా కొత్తగా వుండేలా హొయలొలికించేయడం పూనమ్ పాండేకి కొత్తేమీ కాదు. ఈసారీ ఒకింత జుగుప్సాకరంగానే ఆమె అందాల విందు కన్పించింది.
పూనమ్ పాండే క్రిస్మస్ హాట్ షోకి కొంతమంది ఫిదా అవుతోంటే ఇంకొంతమంది ఆమెకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. కొందరు ఆమెకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకూ ప్రయత్నిస్తున్నారట. సోషల్ మీడియాలో హాట్ షో తన ఇష్టమనీ, తన గ్లామర్ కోసం పిచ్చెకిపోయే కుర్రకారు ఎంతోమంది వున్నారనీ, వారికోసమే తాను ఇదంతా చేస్తున్నానని అంటోంది పూనమ్ పాండే.