రామ్‌, పూరి, ఛార్మి.. 'బోల్డ్‌ - వైల్డ్‌'.!

By iQlikMovies - December 26, 2018 - 10:50 AM IST

మరిన్ని వార్తలు

ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. పూరి కనెక్ట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. నిర్మాణ వ్యవహారాల్ని ఛార్మి చూసుకోనుంది. ఈ సినిమాకి సంబంధించిన విషయాల్ని వెల్లడిస్తూ హీరో రామ్‌ సోషల్‌ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశాడు. అదేంటంటే, 'బోల్డ్‌ వైల్డ్‌ ఫిలిం' అని. వైల్డ్‌ ఫిలిం అంటే, ఇటీవల చాలా సినిమాలొచ్చాయి. బోల్డ్‌ సినిమాలన్నా అంతే. వీటినే, 'రా' సినిమాలని అంటున్నాం. 

 

నిజానికి పూరి జగన్నాథ్‌ సినిమాల్లో ఈ 'వైల్డ్‌, బోల్డ్‌ అండ్‌ రా లుక్‌' ఎప్పటినుంచో వుంటున్నదే. అయితే, దానికి 'షుగర్‌ కోటెడ్‌' అన్నట్లుగా వుంటాయి పూరి సినిమాలు. ఆ సంగతి పక్కన పెడితే, పూరి ఈ మధ్య వరుస ఫ్లాపులు ఇచ్చాడు. గత కొంతకాలంగా పూరి చేసిన ఏ సినిమా కూడా వర్కవుట్‌ అవడంలేదు. తనయుడు ఆకాష్‌తో చేసిన 'మెహబూబా' కావొచ్చు, కళ్యాణ్‌రామ్‌తో చేసిన 'ఇజం' కావొచ్చు, బాలకృష్ణతో చేసిన 'పైసా వసూల్‌' కావొచ్చు.. ఇవేవీ పూరికి హిట్‌ ఇవ్వలేకపోయాయి. 

 

మరి, పూరిని రామ్‌ ఎలా నమ్మినట్లు? ఏమోగానీ, పూరి ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడంటే గత సినిమాల రిజల్ట్‌లతో సంబంధం లేకుండా కొత్త సినిమాలపై క్రేజ్‌ పెరిగిపోతుంటుంది. అదీ పూరి జగన్నాథ్‌ ప్రత్యేకత. అందుకేనేమో రామ్‌ కూడా ఎక్సయిట్‌మెంట్‌తో వున్నాడు. పూరి నుంచి మళ్ళీ 'స్పార్క్‌' కన్పించి, రామ్‌కి సూపర్‌ హిట్‌ ఈ బోల్డ్‌ అండ్‌ వైల్డ్‌ సినిమాతో దక్కుతుందేమో వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS