నంది అవార్డుల ప్రకటించిన తరువాత తలెత్తిన వివాదాల నేపధ్యంలో ప్రముఖ రచయత-నటుడు-దర్శకుడు పోసాని కృష్ణమురళి కొద్దిసేపటి క్రితం ఆ అంశం పైన ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
ఆ ప్రెస్ మీట్ లో ఒక ప్రముఖ పత్రికలో నంది అవార్డులని రద్దు చేస్తాము అని వచ్చింది, ఒక ప్రభుత్వం అలా ఎలా ప్రకటన జారీ చేయగలదు అని చెబుతూనే ఆంధ్రప్రదేశ్ కి చెందిన మంత్రి సినిమా వాళ్ళని NRA (నాన్ రెసిడెంట్ ఆంధ్ర) అని అభివర్ణించడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ఇన్ని వివాదాలు వచ్చిన నేపధ్యంలో ప్రకటించిన నంది అవార్డులని రద్దు చేసి మరలా వేరే పద్దితిలో ఇవ్వాలి అని సూచించాడు. ఇక ఈ పరిణామాల వల్ల తనకి టెంపర్ చిత్రానికి గాను వచ్చిన నంది అవార్డుని వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించేశాడు.
ఇక పోసాని సంచలన వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందించనుందో అనేది వేచి చూడాలి.