కొంతకాలంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బన్నీ ఫ్యాన్స్ కి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కొద్దిగా సద్దుమణిగినట్టే కనపడింది.
అయితే ఈరోజు ఉదయం అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి మళ్ళీ ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య నిప్పు రాజుకున్నట్టుగా తెలుస్తుంది! దీనికి సాక్షమే, యు ట్యూబ్ లో డిజే టీజర్ కి వస్తున్న లైక్స్ మరియు డిజ్-లైక్స్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
టీజర్ రిలీజ్ అయిన 9గంటల్లో 11లక్షలు హిట్స్ వచ్చాయి. ఇదిలాఉంటే ఈ వీడియోకి 47 వేల లైక్స్ ఉంటే డిజ్ లైక్స్ 35వేలు ఉండడం ఇక్కడ ఏదో జరుగుతుంది అనడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఫిలిం నగర్ టాక్ ప్రకారం, ఇది ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న లైక్స్ డిజ్-లైక్స్ పోటీగా చెబుతున్నారు.
ఇలా చేయకూడదని హీరోలు తమ ఫ్యాన్స్ కి యెన్ని సార్లు చెప్పినా మన తెలుగు సినిమా హీరోల అభిమానులు తమ యొక్క “వీర”అభిమానాన్ని మాత్రం చాటకుండా ఉండలేకపోతున్నారు.
ఈ రెండు వర్గాల కామెంట్స్ వార్ ఈ క్రింది స్క్రీన్ షాట్స్ లో మీరూ చూడండి-