మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'విన్నర్'. ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓపెనింగ్స్ అదిరిపోయాయ్. సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సాయిధరమ్ తేజ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు. హార్స్ రేసింగ్స్ ప్రధాన నేపధ్యంగా వచ్చిన ఈ సినిమాలో రేసింగులు కొత్తగా అనిపించాయంటున్నారు సినిమా చూసినవారంతా. హీరో సాయిధరమ్ తేజ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో కన్పించాడు. ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఇంత కొత్తగా కన్పించడానికి అతను చేసిన ప్రయత్నం అభినందనీయం. రకుల్ ప్రీత్ సింగ్ కూడా చాలా గ్లామరస్‌గా కన్పించింది. ఆమె పాత్ర కూడా కొత్తగా ఉంది ఈ సినిమాలో. ఈ సినిమాకి మంచి టాక్ వస్తోంది. ముఖ్యంగా రేసుల గురించి అందరూ చర్చించుకుంటున్న తీరుకి చిత్ర యూనిట్ కూడా మురిసిపోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. 'సుప్రీమ్' సినిమాతో అందుకున్న హిట్‌ని, 'తిక్క'తో కొనసాగించలేకపోయినా, మళ్లీ ఆ స్థాయి విజయాన్ని సాయి ధరమ్ తేజ్‌కి ఈ సినిమా అందిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఈ సినిమాలోని హార్స్ రేసింగుల కోసమే భారీగా ఖర్చు చేశారు. తెలుగు తెరపై ఇదొక కొత్త అనుభూతి అంటున్నారు అంతా.