ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ వ‌స్తోందోచ్‌!

మరిన్ని వార్తలు

ప్ర‌భాస్ - రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప‌ట్టాలెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఏమిటో ఇప్ప‌టి వ‌ర‌కూ చెప్ప‌లేదు. క‌నీసం ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేయ‌లేదు. ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ గురించి ఎదురు చూసీ చూసీ అభిమానుల‌కు కూడా విసుగొచ్చేసింది.

 

ఇంత కాలానికి ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ కి మోక్షం వ‌చ్చింది. ఈ కొత్త సినిమాకి సంబంధించిన టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ ఈనెల 10న ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌క‌టిస్తామ‌ని యూవీ క్రియేష‌న్స్ చెప్పేసింది. ఈ సినిమా కోసం జాన్‌, రాధే శ్యామ పేర్లు గ‌ట్టిగా వినిపించాయి. రాధే శ్యామ‌నే ఖ‌రారు అయ్యే ఛాన్సుంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమా కోసం హైద‌రాబాద్ లోని అన్న‌పూర్ణ స్టూడియోలో మూడు భారీ సెట్లు వేశారు. అందులోనే కొత్త షెడ్యూల్ మొద‌లెడ‌తారు. ఆ డేట్ కూడా చిత్ర‌బృందం ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS