'బాహుబలి' శాసించాడు ఆయన మాటే శాసనం.!

మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమాకి టాలీవుడ్‌ నుండి ప్రముఖ హీరోలందరూ తమదైన స్టైల్‌లో మద్దతు పలుకుతున్నారు. ఈ రకంగానూ మన సెన్సేషనల్‌ హీరో సెన్సేషన్‌ సృష్టిస్తున్నాడు. నిజానికి గతంలో ఏ యంగ్‌హీరో సినిమా విషయంలోనూ ఇలా జరిగిన సందర్భాలు లేవనే చెప్పాలి. కొత్త టెక్నీషియన్లు కష్టపడి తెరకెక్కించిన చిత్రం 'టాక్సీవాలా'. 

అలాంటిది సెన్సార్‌ కాకుండానే సినిమా ఫుల్‌ పైరసీ వీడియో నెట్టింట్లో దర్శనమిచ్చేయడం నిజంగా దురదృష్టకరం. దాంతో చిత్ర యూనిట్‌ చాలా నిరాశకు గురైంది. గతంలో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా కూడా ఇదే తరహాలో పైరసీ జరిగింది. అయితే స్టార్‌ వేల్యూ ఉండడంతో ఆ సినిమా రికార్డు హిట్‌ అందుకుంది. మరి విజయ్‌ దేవరకొండ విషయంలో ఏం జరిగేను. అసలే విజయ్‌కి ఇప్పుడు టైం బాగోలేదు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు చిత్ర యూనిట్‌. 

అలాగే ఇండస్ట్రీ తరపున పలువురు ప్రముఖ హీరోలు ఈ సినిమాకి సపోర్ట్‌ అందిస్తున్నారు. తప్పకుండా ధియేటర్స్‌కి వెళ్లి 'టాక్సీవాలా' సినిమాని వీక్షించమని యంగ్‌ హీరోలతో పాటు స్టార్‌ హీరోలు కూడా అండగా నిలవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించినా, మరోవైపు ఇండస్ట్రీ మొత్తం విజయ్‌దేవరకొండకు అండగా నిలవడం శుఖ పరిణామమే అనిపిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి బన్నీ వచ్చాడు. తాజాగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రబాస్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ పైరసీ జోలికి పోకుండా 'టాక్సీవాలా' సినిమాని ధియేటర్స్‌లో చూడండనీ అభిమానులకు పిలుపునిచ్చాడు. 

ప్రబాస్‌ చెప్పడం ఫ్యాన్స్‌ ఫాలో చేయకపోవడమా..! ఆ రకంగా ప్రబాస్‌ ఫ్యాన్స్‌నీ బుట్టలో వేసేశాడు విజయ్‌ దేవరకొండ. అయితే ఇన్ని రకాల ప్రయత్నాలు జరిగినా విజయ్‌ దేవరకొండను విజయం వరించేనో లేదో మరి కొద్ది గంటల్లోనే తెల్సిపోనుంది. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS