ఆదిపురుష్‌ ట్రైలర్‌: ఇది ప్రభాస్ రామాయణం

మరిన్ని వార్తలు

ప్రభాస్‌  రాముడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇతిహాసగాథ ‘ఆది పురుష్‌’ . కృతిసనన్‌ సీతగా నటిస్తోంది. ఈ రోజు ‘ఆది పురుష్‌’ ట్రైలర్‌ను విడుదల చేశారు.
 

‘ఇది నా రాముడి కథ. 
ఆయన మనిషిగా పుట్టిన భగవంతుడైన మహనీయుడు. 
ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. 
ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది.
ఇది ఆ రఘునందుడి గాథ. యుగయుగాల్లోనూ సజీవం.. జాగ్రుతం.
నా రాఘవుడి కథే రామాయణం.. ’’ అనే వాయిస్ తో ట్రైలర్ మొదలైయింది. 
 

రామాయణంలో కీలక ఘట్టాలైన సీతాపహరణం, యుద్ధకాండంపై ఎక్కువ విలువల్స్ చూపించారు. టీజర్ విడుదల చేసినప్పుడు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఆపి కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ ట్రైలర్ లో మంచి పని తీరు కనిపించింది. ప్రభాస్ రాముడిగా ఆకట్టుకున్నాడు. చివర్లో యుద్ధ సన్నివేశాలని భారీగా తీర్చిదిద్దారని అర్ధమౌతుంది. ఇది వరకు చాలా మంది రామ కథ తీశారు. ‘ఆది పురుష్‌' టేకింగ్ మేకింగ్ పరంగా వాటికీ భిన్నంగా వుందని మాత్రం చెప్పొచ్చు.  జూన్ 16న ఈ సినిమా విడుదలౌతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS