ప్రభాస్ అభిమానులు `బుజ్జిగాడు` సినిమాని అంత తేలిగ్గా మర్చిపోలేరు. అందులో ప్రభాస్ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్... సింప్లీ సూపర్బ్. ఆసినిమాలోని కథానాయిక త్రిషతో ప్రభాస్ కెమిస్ట్రీ ఎంతలా కుదిరిందో. అంతకు పది రెట్ల కెమిస్ట్రీ ప్రభాస్- మోహన్ బాబు మధ్య సెట్టయ్యింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సీన్లన్నీ పోటాపోటీగా పండాయి. ఇప్పుడు మరోసారి.... వీరిద్దరి మ్యాజిక్ చూసే అవకాశం దక్కబోతోంది.
ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా `ఆది పురుష్`. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడని చిత్రబృందం అధికారికంగా ధృవీకరించింది. ఇప్పుడు మరో కీలక మైన పాత్రకోసం కలక్షన్ కింగ్ మోహన్ బాబుని ఎంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే - `ఆది పురుష్` ప్రాజెక్టుకి కొత్త కళ వచ్చినట్టే. ఇటీవల `మహానటి`లోనూ ఓ కీలకమైన పాత్ర పోషించారు మోహన్ బాబు. అందులో ఎస్వీఆర్ గా నటించి మెప్పించారు. ఈసారీ మోహన్ బాబు పాత్ర ప్రత్యేకంగా ఉండబోతోందని ముంబై వర్గాలు చెబుతున్నాయి. మరి ఇది ఎంత వరకూ నిజమో తెలియాలంటే, ఇంకొన్ని రోజులు ఆగాలి.